బండి సంజయ్ అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. దుబ్బాక వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బండి సంజయ్‌కు గాయాలయ్యాయి. తట్టుకోలేని ఆయన గట్టిగా కేకలు పెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్య అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  సిద్దిపేట పోలీసులు అతిగా ప్రవర్తించారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతో టీఆర్‌ఎస్‌ ఇలా చేస్తోందని ఎద్దేవాచేశారు. నోటీసులు లేకుండా పోలీసులు సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

సిద్దిపేటలోని రఘనందన్ రావు ఇంటి దగ్గరికి పోలీసులు ఓ బ్యాగ్ తో రావడం కలకలం రేపుతోంది. వేరే ఇంట్లో  దొరికిన డబ్బులను రఘునందర్ రావు మామ.. గోపాల్ రావు ఇంట్లో పెట్టేందుకు పోలీసులే డబ్బు తీసుకొచ్చారని కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు డబ్బు బ్యాగ్ తీసుకొస్తున్న దృశ్యాలను కార్యకర్తలు రికార్డ్ చేశారు. పోలీసులు డబ్బులు దాచేందుకు ప్రయత్నించడంతో.. ఆగ్రహించిన కార్యకర్తలు పోలీస చేతిలో నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు.

రఘునందన్ మామ ఇంటికి చేరుకోవడం, పోలీసులు కూడా భారీగా మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో రఘునందన్ కింద పడిపోయారు. దీంతో కిద్దిసేపు ఆయన అస్వస్థతకు గురయ్యారు. సిద్ధిపేటకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్ఢుకంటున్నారు. దీంతో కొన్నిచోట్ల రోడ్డుపైనే పార్టీ కార్యకర్తలు    బైఠాయించారు. కార్యకర్తలను అక్కడ్నుంచి పంపేందుకు పోలీసులు లాఠిచార్జి చేశారు.