ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం ఎయిమ్స్ వైద్యుల బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి తెలిపారు.
సెప్టెంబర్ 29న కోవిడ్19 బారిన పడిన ఆయన అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వెంకయ్య భార్య ఉషా నాయుడుకు కూడా కరోనా వైరస్ పరీక్ష జరపగా అప్పుడు ఆమెకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ట్విట్టర్‌లో తెలిపింది.
ఎయిమ్స్ నిర్వహించిన ఆర్‌టిఎఫ్‌పిసిఆర్ ప్రకారం ఉపాధ్యక్షుడు, అతని భార్య ఉషా నాయుడు ఇద్దరికి నెగటివ్ అని తేలింది. నాయుడు ఆరోగ్యం కుదుట పడడంతో డాక్టర్ సలహా మేరకు త్వరలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.
తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయితే వైద్యుల సూచనలను మరికొంతకాలం పాటు కొనసాగించడం మంచిదని ఇంటి నుంచే జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
స్వీయ నిర్బంధ కాలంలో తన ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేసిన ప్రజలు, అభిమానులు, వివిధ పార్టీల నేతలు, కులాలు, మతాలకు అతీతంగా తాను కోలుకోవాలని ఆకాంక్షించి, ప్రార్థనలు చేసిన వారందరి ప్రేమాభిమానాలకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు చెప్పారు.
కరోనా సంక్రమణ కాలంలో ఆరోగ్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన వ్యక్తిగత సహాయకులకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు.
More Stories
ఆ కుటుంబం దేశాన్ని పాలించడానికే పుట్టామనుకుంటోంది
షారుక్ ఖాన్ బెదిరింపుల కేసులో పోలీసుల అదుపులో లాయర్!
దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు