వరుసగా 20 ఏండ్లు అధికారంలో ఉన్న నేతగా మోదీ 

వరుసగా 20 ఏండ్లు అధికారంలో ఉన్న నేతగా మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ  అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా 20 ఏండ్ల పాటు అధికారం‌‌‌‌లో ఉన్న నేతగా ఘనత సాధించారు. గుజరాత్‌‌‌‌ ముఖ్యమంత్రిగా 2001లో అక్టోబర్‌‌‌‌ 7న బాధ్యతలు చేపట్టిన మోదీ  13 ఏండ్లు కొనసాగారు. తర్వాత 2014లో లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. ఏడేండ్లుగా ఆ హోదాలో కొనసాగుతున్నారు. 

అధికారంలో ఉన్న నేతగా బుధవారం 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా మోదీ  ఓటమి లేని నాయకుడంటూ బీజేపీ నేతలు, ప్రముఖులు ప్రసంశలు కురిపించారు. #20thYearOfNamo హ్యాష్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌తో సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టులు, ట్వీట్లు పెడుతున్నారు.

 ప్రపంచంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వ్యక్తుల్లో మోడీ ఒకరంటూ కేంద్ర మంత్రి రవి శంకర్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, ఫ్రాంక్లిన్ రూజ్‌‌‌‌వెల్ట్, దివంగత బ్రిటన్‌‌‌‌ ప్రధాన మంత్రి మార్గరేట్ థాచర్‌‌‌‌లతో మోడీని పోల్చారు. భారతీయులకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు. మరింత కాలం అధికారంలో కొనసాగే పవర్‌‌‌‌ మోడీకి రావాలని కోరుకున్నారు. 

ప్రభుత్వ అధినేతగా ఓటమెరుగని నేతంటూ ప్రధానిని బీజేపీ అధ్యక్షుడు  జేపీ నడ్డా పొగిడారు. ‘వ్యవసాయంలో సంస్కరణలు, పరిశ్రమల వృద్ధి‌‌‌‌, బాలిక విద్యను ప్రోత్సహించి గుజరాత్‌‌‌‌ను మోదీ మార్చేశారు. ఇప్పుడు పీఎంగా భారత్ ను నూతన భారత్ గా మార్చుతున్నారు’ అని కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్‌‌‌‌ ప్రశంసించారు.

‘దేశం కోసం ప్రధాని మోదీ  నిరంతరం పని చేస్తున్నారు. ప్రతిపక్షాలు అతన్ని ఆపలేవు. దేశప్రజలకు మోడీపై నమ్మకం ఉంది. అతని సంకల్పం ఎప్పటిలానే బలంగా ఉంటుంది’ అని ఉత్తరప్రదేశ్‌‌‌‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు.