గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికలను ఈవీఎంలు లేదా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరించగా బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వహించాలని మెజార్టీ రాజకీయ పార్టీలు కోరినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మొత్తం 11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లు ఉండగా 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయి. 5 పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరగా, ఒక్క పార్టీ మాత్రమే ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. 2 రాజకీయ పార్టీలు మాత్రం ఎలాంటి అభిప్రాయం తెలపలేదు. ఈ ఎన్నికలను ఈవిఎంలతో బిజెపి ఎన్నికల కమీషన్ ను కోరింది.
పార్టీ గుర్తు లేని 39 రాజకీయ పార్టీల్లో 18 పార్టీలు తమ అభిప్రాయం చెప్పాయి. రెండు రాజకీయ పార్టీలు ఈవీఎం ద్వారా ఎన్నికలు జరపాలని కోరగా, . 11పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి. 5 రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. మొత్తమ్మీద 50 పార్టీ లు ఉండగా వాటిల్లో 26రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం చెప్పగా..13పార్టీలు బ్యాలెట్ ,3పార్టీ లు ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు