ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటి కానున్నారు. ఇటీవలే హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి ఎల్లుండి ప్రధానితో భేటి కానున్నారు.
ఈ భేటిలోనూ రాష్ట్ర ఆర్ధికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, నిధుల విడుదల అవసరాన్ని చర్చించనున్నారు. సోమవారం నాడు సిఎం జగన్ పులివెందుల వెళతారు. అక్కడ తన మామ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గంటారు. అక్కడ నుంచి రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు.
ఇలా ఉండగా, విజయవాడ నగర వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. గత నెలలోనే ప్రారంభం కావాల్సిన ఫైఓవర్ రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ నెల 16న కనకదుర్గ ఫైఓవర్‌ను ప్రారంభించేందుకు నిర్ణయించారు.
ఫైఓవర్‌ను వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటు రూ.7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు గడ్కరీ, జగన్‌మోహన్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల సమయం ఉన్న తరుణంలో కరోనా బారిన పడడం డొనాల్డ్ ట్రంప్ ప్రచారంపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యర్థి బైడెన్‌కు కరోనా నెగిటివ్ రావడంతో ఆయన తన ప్రచారం కొనసాగిస్తున్నారు.ఎకానమీ వెనుకంజ, పౌర ఆందోళనలు ట్రంప్‌కు నెగెటివ్‌గా మారగా, తాజా కోవిడ్ ఘటన మరింత నెగెటివ్ ప్రభావం చూపుతోంది.
More Stories
సిఆర్డిఏ పరిధిని పునరుద్ధరించిన ఏపీ మంత్రివర్గం
టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన బీఆర్ నాయుడు
అమరావతి పాత టెండర్లు రద్దు