టీటీడీ నూతన ఈవోగా జవహర్ రెడ్డి!

టీటీడీ నూతన ఈవోగా జవహర్ రెడ్డిని నియమించనున్నది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 9న ఆయన కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ రేపు ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. ఇక కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించేవరకు టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. 
జవహర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ తరపున ఆయన కీలకంగా వ్యవహరించారు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంతో ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేసినట్టు తెలుస్తున్నది.  అనిల్ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది.
ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను టీటీడీ ఈవోగా నియమించింది. సింఘాల్ రెండేడ్ల పదవీకాలం 2019లో ముగిసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నది.