ఇస్రో శాటిలైట్ ‌ల‌పై చైనా సైబర్ దాడులు!   

కేవ‌లం ల‌డాఖ్ లోనే కాకుండా భార‌తీయ అంత‌రిక్ష ప్ర‌యోగాల‌ను కూడా చైనా టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఇస్రో చేప‌ట్టిన ప‌లు శాటిలైట్ క‌మ్యూనికేష‌న్ల వ్య‌వ‌స్థ‌ల‌పై చైనా సైబర్ దాడులు చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు.
2012 నుంచి 2018 మ‌ధ్య ఈ దాడులు జ‌రిగిన‌ట్లు ఓ క‌థ‌నం ద్వారా తెలుస్తోంది. అమెరికాకు చెందిన చైనా ఏరోస్పేస్ స్ట‌డీస్ ఇన్స్‌టిట్యూట్ (సీఏఎస్ఐ) త‌న నివేదిక‌లో ఈ విష‌యాన్ని చెప్పింది.  సైబ‌ర్ దాడులు స‌హ‌జ‌మే అయినా.. త‌మ వ్య‌వ‌స్థ‌ల‌కు మాత్రం ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌లేద‌ని ఇస్రో స్ప‌ష్టం చేసింది.
2012లో ఇస్రో ప్రాజెక్టుపై చైనా సైబ‌ర్ దాడి చేసిన‌ట్లు సీఏఎస్ఐ త‌న రిపోర్ట్‌లో చెప్పింది. భార‌త్ చేప‌ట్టిన జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబరేట‌రీల కంట్రోల్ కోసం దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అంత‌రిక్ష ప్ర‌యోగాల్లో కౌంటర్ దాడి చేసే టెక్నిక్‌లు చైనా ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు సీఏఎస్ఐ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది.
 గ్రౌండ్ నుంచి జియోసింక్రోన‌స్ ఆర్బిట్ వ‌ర‌కు అంత‌రిక్ష వ్య‌వ‌స్థ‌ల‌ను చైనా టార్గెట్ చేయ‌గ‌ల‌దు. చైనా వ‌ద్ద కో-ఆర్బిటాల్ శాటిలైట్లు ,  కైనిటిక్ కిల్ వెహికిల్స్‌, యాంటీ శాటిలైట్ మిస్సైళ్లు, జామ‌ర్లు ఉన్న‌ట్లు సీఏఎస్ఐ పేర్కొన్న‌ది. శ‌త్రువుల‌ను దెబ్బ‌తీసే విధంగా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ టెక్నాల‌జీ అభివృద్ధి చేసిన‌ట్లు రిపోర్ట్‌లో వెల్ల‌డించారు.
అంత‌రిక్ష వ్య‌వ‌స్థకు సంబంధించిన మొత్తం సిస్ట‌మ్‌ను హైజాక్ చేసేందుకు చైనా వ‌ద్ద ఏ-శ్యాట్ ఇంట‌ర్ సెప్టార్లు ఉన్న‌ట్లు కార్నేజ్ ఎండోమెంట్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ పేర్కొన్న‌ట్లు క‌థ‌నంలో తెలిపారు. స్పేస్‌క్రాఫ్ట్‌ల‌ను, శాటిలైట్ల‌ను కంట్రోల్ చేసే టెక్నాల‌జీ చైనా వ‌ద్ద ఉన్న‌ట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.