కేరళలో పోలీస్ రాజ్యం

టి సతీసన్

హోమ్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న సి పిఎం అధినేత, కేరళ ముఖ్యమంత్రి పునరాయి విజయన్ పోలీసులు బీజేపీ, యువమోర్చ, ఎబివిపి కార్యకరతలపై కేరళలో అధ్వాన్నమైన అత్యాచారాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నుండి ఉన్నత విద్య, వక్ఫ్ మంత్రి కె టి జలీల్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారిని చిత్రహింసలకు గురిచేశారు.

కేరళ రాజకీయాలను కుదిపివేస్తున్న బంగారం అక్రమ రవాణా, యుఎఇ నుండి అక్రమంగా కురాన్ ప్రతులను దిగుమతి చేసుకున్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జలాల్ కు సమన్లు జారీ చేసినప్పటి నుండి నిరసనలు ప్రారంభమయ్యాయి.

యుఎఇ కాన్సులెట్ విరాళంగా ఇచ్చిన ఆహార పాకెట్ లను తన నియోజకవర్గంలో పంపిణి చేసిన్నట్లు ఆ మంత్రి స్వయంగా అంగీకరించారు. విదేశీ మంత్రిత్వ శాఖకు తెలుపకుండా విదేశీ కాన్సులేట్ తో కలసి పనిచేయడం, చట్టవ్యతిరేకంగా మతసంబంధ గ్రంధాలను దిగుమతి చేసుకోవడం ద్వారా అన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడైనది.

అత్యవసర పరిస్థితి సమయంలో (1975-1977) వలె లేదా అంతకన్నా అధ్వాన్నంగా అమానుష చిత్రహింసలకు పోలీసులు పాల్పడ్డారు. తనకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయాన్ని మీడియాకు తెలుపకుండా దాచి ఉంచి జలాల్ అవమానకర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. తనకు ఎటువంటి సమన్లు అందలేదని లేదా తానను ఈడీ ప్రశ్నిపలేదని అంటూ మీడియా ముందు అబద్దాలు చెబుతూ వచ్చారు.

రోజు రోజుకి, పినరయి విజయన్ పాలనలో కలిగే ఇబ్బందులు మరిన్ని కోణాలలో వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు, పినారాయ్ యొక్క విశ్వసనీయ లెఫ్టినెంట్ , మంత్రివర్గంలో రెండోవారైన ఇ పి జయరాజన్ కుమారుడు జేసన్ కు సిఎం కార్యాలయంతో ముడిపడి ఉన్న బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు స్వాప్నా సురేష్‌తో ఆనందించిన సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. 

సస్పెండ్ అయిన సీఎం కార్యాలయంలోని ప్రధాన కార్యదర్శి  ఎం శివశంకర్ కు స్వప్న రమేష్ సన్నిహితురాలు. స్వప్న సురేష్ గౌరవార్థం అదే విఐపి కుమారుడు ఆతిథ్యమిచ్చిన పార్టీ వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాప్నాతో జేసన్ చిత్రం సోషల్ మీడియాలో రౌండ్లు చేస్తోంది.

కాగా, కోవిడ్  -19 నిబంధనలను ఉల్లంఘించి లాకర్ ను తెరవడం కోసం ఇ పి జయరాజన్ భార్య పి కె ఇందిర బ్యాంకు ను సందర్శించారు. ఆమె కోవిడ్ -19 పరీక్షల కోసం ఒక నమూనాను సమర్పించింది. కోవిడ్ -19 ప్రోటోకాల్ ప్రకారం పరీక్షా చేయించుకున్న తర్వాత ఫలితాలు వచ్చేవరకు ఎవరైనా క్వారంటైన్ లో ఉండవలసిందే.

 
(ఆర్గనైజర్ నుండి)