9 మంది ఆల్‌ఖ‌యిదా ఉగ్రవాదుల గుట్టు రట్టు 

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదుల గుట్టును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) శనివారం రట్టు చేసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేసి అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 9 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 
 
నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 9 మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.   
అల్ ఖైదా ఉగ్రవాదుల నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
అరెస్టు అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు.

ఆల్ ఖ‌యిదా మ‌ద్ద‌తుదారులు నిధుల స‌మీక‌ర‌ణ కోసం విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు కొనేందుకు కొంఅంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదుల గుట్టును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) శనివారం రట్టు చేసింది.