ఎంపీల వేతనాలు 30 శాతం తగ్గింపు

ఎంపీల వేతనాలు 30 శాతం తగ్గింపు
పార్లమెంట్‌ సభ్యుల వేతనంలో 30 శాతం కోత విధించే బిల్లును లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కోవిడ్‌-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో ఎంపీల వేతనాల్లో కోత విధిస్తూ పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు, పెన్షన్‌ (సవరణ) బిల్లు, 2020కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
 
ఇక నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలపై లోక్‌సభ చర్చిస్తోంది. బిల్లు సవరణలకు సభ ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 
 
మరోవైపు డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్‌లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్‌క్రాఫ్ట్‌ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలికసదుపాయాలు మరింత బలోపేతమవుతాయని ఆయన పేర్కొన్నారు.