పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హింసపై ఢిల్లీ పోలీసులు బుధవారం 15,000 పేజీలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్‌లో 15 మంది పేర్లను పొందుపరిచారు.
ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీలో 53 మంది మరణించారు. ఈ హింసాకాండపై కర్కదూమా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో 15 మంది నిందితుల పేర్లను చేర్చారు.
వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.మరోవైపు ఢిల్లీ ఘర్షణల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో జేఎన్‌యూ నేత ఉమర్ ఖలీద్, సర్జీల్ ఇమాంల పేర్లను ప్రస్తావించలేదు.

More Stories
ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక వేధింపులపై ఎన్హెచ్ఆర్సి
‘సర్’ ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు
విజయవంతంగా స్వదేశీ ఖగంటక్-243 గ్లైడ్ బాంబు ప్రయోగం