ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడితప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో `చట్టబద్ధ పాలన‘ అమలు కావడం లేదని కోర్టు మరోసారి మండిపడింది.
గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఒకింత కన్నెర్రజేసింది.!.
అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. వెంకటరాజు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది.
గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

More Stories
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి… నాణ్యమైన ప్రసాదాన్ని అందించాలి
వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు