రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు 

రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు 

రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచించలేదని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పష్టం చేశారు. రాజకీయాలలో ప్రవేశించడం కోసమే తాను వివాదాలు సృష్టిస్తున్నానని అంటూ వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ   తనకు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

వ్యక్తిగత స్వేచ్ఛతో నాకు నచ్చిన వారికి మద్దతు ఇస్తానాని చెబుతూ ఈ విషయంలో ట్రోలింగ్స్‌‌ను ఆపాలని కంగన కోరారు. రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతోనే తాను ప్రధాని మోదీజీకి మద్దతు ఇస్తున్నానని భావిస్తున్నవారికి తమది రాజకీయ కుటుంభం అని ఆమె తెలిపారు. 

“మా తాత కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా 15 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. మా కుటుంబం రాజకీయాల్లో చాలా పాపులర్. గ్యాంగ్‌‌స్టర్ మూవీ తర్వాత ప్రతి ఏడాది నాకు ఆఫర్స్ వచ్చాయి” అని ఆమె పేర్కొన్నారు. 

మణికర్ణిక సినిమా అనంతరం కాంగ్రెస్‌‌తోపాటు బీజేపీ కూడా తనకు టికెట్ ఆఫర్ చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఒక కళాకారునిగా తాను తన వృత్తిపరమైన పనిలో నిమగ్నమై ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.