 
                జమ్ముకశ్మీర్లోని బందీపోరా జిల్లా హజిన్ ప్రాంతంలో ఇవాళ (మంగళవారం) ఉగ్రవాద సహచరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 
హజీన్ ప్రధాన మార్కెట్లో పాకిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కలిసి దాడి చేశారు. లష్కరే-ఇ-తోయిబా ఉగ్రవాదుల సహచరులను ముగ్గురిని అరెస్టు చేశారు. సంబంధిత సెక్షన్ల కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. 
నిందితులను మీర్ మొహల్లా ప్రాంతానికి చెందిన ముజీబ్ శ్యామస్, తన్వీర్ అహ్మద్ మిర్, ఇంతియాజ్ అహ్మద్ షేక్గా గుర్తించారు. వీరి  దగ్గర నుంచి గ్రనేడ్, పలు దుస్తులు, కుట్టు మిషన్, పాక్ జాతీయ జెండాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 
ఈ ఏడాది ఇప్పటివరకు కశ్మీర్ లోయ వ్యాప్తంగా 113 మంది ఉగ్రవాద సహచరులను పోలసులు అరెస్టు చేశారు.  
                            
                        
	                    




More Stories
రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
జబల్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు ప్రారంభం
బీహార్ లో ప్రతిపక్షం గెలిస్తే పిఎఫ్ఐ కార్యకర్తలను జైల్లోనే ఉంచుతారా?