భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. చర్ల – ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అడవుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే మృతుల వివరాలు తెలియలేదు.
ఎన్ కౌంటర్ ప్రాంతానికి తరలి వెళ్లిన కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అక్కడ పరిశీలిస్తున్నారు. ఆదివారం రాత్రి చర్ల మండలంలోని పెదముసిలేరు గ్రామ శివారులో గల పైడి వాగు వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చివేశారు.
ఆదివారం అర్ధరాత్రి జిల్లాలోని చర్ల మండలం పగిడివాగు దగ్గర మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. మందుపాతర పేల్చడంతో రహదారిపై భారీ గొయ్యి ఏర్పడింది. అలాగే రహదారిపై పోస్టర్లను వదలివెళ్లారు. దేవర్లపూడి ఎన్కౌంటర్కి నిరసనగా శబరి ఏరియా కమిటీ బంద్ కు పిలుపు ఇచ్చింది.
మందు పాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసుల ఎన్ కౌంటర్ జరగడంతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండాల మండలంలో ఈనెల 3న మావోయిస్టు సభ్యుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే.

More Stories
కొత్త `ఉపాధి’ చట్టంపై ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాలి
మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ఫోన్ ట్యాపింగ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ