 
                దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. అత్యధిక కేసులతో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ను భారత్ వెనక్కి నెట్టేసింది. నిన్న 90,600 కేసులు నమోదవగా, ఈరోజు దానికి మించి రెండు వందల కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఒక్క రోజు వ్యవధిలోనే కరోనా కేసులు 42 లక్షల మార్కును దాటాయి.
దేశంలో మరోసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 90,802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 42,04,614కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 8,82,542 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 32,50,429 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, కరోనా వైరస్ వల్ల 71,642 మంది మరణించారు. తాజాగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు మరో 1,016 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా 4,95,51,507 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 7,20,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
                            
                        
	                    




More Stories
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం