పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ముంబై

ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ముంబై పోలీసుల తీరుపై కంగన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

దీంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. కంగనపై విరుచుకుపడ్డారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టవద్దని శివసేన అధికార పత్రిక `సామ్నా`లో పేర్కొన్నారు. 

దీనిపై కంగన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. `ముంబైలో అడుగు పెట్టవదని సంజయ్ రౌత్ నాకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోంద`ని కంగన ట్వీట్ చేసింది.

`సుశాంత్ ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే నేను ముంబై పోలీసులను నమ్మడం లేదు. నేను రక్షణ విషయంలో అభద్రతగా ఫీలైతే బాలీవుడ్‌ను, ముంబైని ద్వేషించినట్టేనా` అని కంగన పేర్కొంది.