శ్రీ మహా విష్ణువు యొక్క వామన అవతారం గురించి కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ‘మోసం (చీట్)’ అనే పదాన్ని ఉపయోగించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
“మేము మహాబలి (రాజా బాలి) ను జరుపుకుంటాం. అతడిని మోసం చేసిన వామనను కాదు” అని కేరళ మంత్రి థామస్ ఐజాక్ ట్వీట్ చేస్తూ.. ఓనం పండుగ సందర్భంగా ప్రజలను పలకరించి, 14 రకాల కూరగాయల సరసమైన ధరలను ప్రకటించారు. మహాబలి కుల, మతం ఆధారంగా ఎవరినీ వివక్ష చూపలేదు” ట్విట్టర్ లో కామెంట్లు చేశాడు.
మంత్రి థామస్ ఐజాక్ చేసిన ట్వీట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేకే సురేంద్రన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది భక్తులు వామనుడిని ఆరాధిస్తారని, ఆయన విష్ణువు అవతారమని నమ్ముతారని చెప్పారు.
రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలోని త్రికక్కర వద్ద ఉన్న వామనుడి ఆలయంలో ఓనం అతిపెద్ద పండుగగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. థామస్ ఐజాక్ వామనుడిని అవమానించాడని, అందుకని విష్ణు భక్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలని సురేంద్రన్ ఫేస్ బుక్ పోస్ట్ లో డిమాండ్ చేశాడు.

More Stories
అరెస్టైన వైద్యురాలు భారత్లో జైషే మహిళా అధిపతి
ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు
ఢిల్లీ సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్