మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నిరుణాలకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని, మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, జరిమానా గానీ విధించకూడదని ఆదేశించింది.
ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఆగస్ట్ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బిఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని కోరారు.

More Stories
సిద్ధంగా ఐదు తేజస్ మార్క్1-ఏ ఫైటర్ విమానాలు
అమెరికా ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ
దేశీయ ఐటీ దిగ్గజాల షేర్లు 6 శాతం పతనం