
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను సీఐడీ నుంచి తాజాగా సీబీఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 24న యరపతినేనిపై కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. యరపతినేని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉండగా పెద్దఎత్తున మైనింగ్ అక్రమాలకు పాల్పడటంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
కోర్టు జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాడు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణాతోపాటు దాచేపల్లి మండలం నడికుడిలో అక్రమ మైనింగ్ జరిగినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది.
అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్ధారించిన సిఐడి దీనికి సంబంధించి యరపతినేనితోపాటు 16 మందిపై 18 కేసులు నమోదు చేసింది.
More Stories
న్యాయస్థానాల పరిధిలో హైకోర్టు తరలింపు అంశం
బీజేపీలో చేరిన కీలక జనసేన నేత
రూ 4,411 కోట్లతో టీటీడీ బడ్జెట్