కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలు కుంటున్నారు. ఆయన ఆరోగ్యం ఆదివారం కాస్త మెరుగుపడిందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్లాస్మా చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడినట్లు వెల్లడించారు. మరో 2 రోజులు వెంటిలేటర్‌పై ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని, స్పృహలోకి వచ్చారని వివరించారు.
అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ కూడా సాయంత్రం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడిందని.. అందర్నీ గుర్తు పడుతున్నారని చెప్పారు. తన తల్లి కూడా బుధవారంలోపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నదని తెలిపారు.
More Stories
చైనా జాతీయుడికి `సుప్రీం’ బెయిల్ నిరాకరణ
బుల్డోజర్ న్యాయం ఆపేయమన్న సుప్రీంకోర్టు
కేరళలో నిపా కలకలం.. మరోసారి మాస్క్ తప్పనిసరి!