రష్యా క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేసింది

రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను  అభివృద్ధి చేశామని    ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్ర‌పంచంలో తొలిసారి కోవిడ్‌19 వ్యాక్సిన్‌కు ర‌ష్యా ఆరోగ్య శాఖ ఆమోదం ఇచ్చిన‌ట్లు పుతిన్ తెలిపారు.  ఆ టీకాను త‌న  ఇద్దరు కుమార్తెలకు వ్యాక్సిన్‌ వేయించినట్టు కూడా పుతిన్ వెల్ల‌డించారు. 

 ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు.  

మాస్కోకు చెందిన గ‌మేలియా ఇన్స్‌టిట్యూట్ ఆ టీకాను అభివృద్ధి చేసింది.  ర‌ష్యా ఆరోగ్య‌శాఖ ఆ టీకాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పుతిన్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు పుతిన్ తెలిపారు.

కరోనా వైర‌స్ సోకిన త‌న కూతురికి ఆ టీకాను ఇచ్చిన‌ట్లు పుతిన్ వెల్లిడించారు.  వ్యాక్సిన్ ఇచ్చిన త‌ర్వాత త‌న కూతురి శ‌రీరంలో స్వ‌ల్ప‌లంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిన‌ట్లు అధ్య‌క్షుడు పుతిన్ చెప్పారు. కానీ త్వ‌ర‌గానే త‌న కూతురు సాధార‌ణ స్థాయికి వ‌చ్చిట్లు తెలిపారు. 

టీకా ప్ర‌యోగంలో భాగంగా త‌న కూతురు పాల్గొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తొలిసారి వ్యాక్సిన్ ఇచ్చిన త‌ర్వాత త‌న కూతురి టెంప‌రేచ‌ర్ 38గా న‌మోదు అయ్యింద‌ని, త‌ర్వాత రోజు టెంప‌రేచ‌ర్ 37కు ప‌డిపోయిన‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు తెలిపారు.

సెప్టెంబ‌ర్ నుంచి ఆ టీకాను హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు తొలుత ఇవ్వ‌నున్న‌ట్లు ర‌ష్యా డిప్యూటీ ప్ర‌ధాని త‌త్యానా గొలికోవా తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఆ టీకా అందుబాటులో ఉంటుంద‌ని చెప్పారు.