నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పైగా, తనకొక ఏపీ పోలీసులపై నమ్మకం లేదని కూడా స్పష్టం చేశారు.
ఈ విషయమై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఢిల్లీ హై కోర్ట్ ను కూడా ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది. ఆయనకు ఇప్పుడు సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. లోక్ డౌన్ సమయం నుండి ఆయన నియోజకవర్గానికి, ఏపీకి దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ అమలులో ఉందని, ఈ సమయంలో రావడం సరికాదని అయన చెప్పారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కర్ఫ్యూ సడలింపు తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు.
తానిచ్చిన ఫిర్యాదుపై వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం తనకు వై కేటగిరి భద్రత కల్పిస్తోందని రఘురామ రాజు సంతోషం వ్యక్తం చేశారు.

More Stories
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన
శ్రీ పద్మావతీ అమ్మవారి వాహనసేవలో తరిస్తున్న శ్రీ రంగం శ్రీవైష్ణవులు