అయోధ్య: మధ్యవర్తిత్వం – సంప్రదింపులు – వాస్తవాలు

అయోధ్య: మధ్యవర్తిత్వం – సంప్రదింపులు – వాస్తవాలు

మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాటంలో మధ్యవర్తిత్వం, సంప్రదింపుల చరిత్రను పరిశీలిద్దాం.

 సిద్దేశ్వర్ శుక్లా
రామజన్మభూమి వివాదంపై 8మార్చ్2019 తేదిన, ఆంతరంగిక మధ్యవర్తిత్వం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా, అధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవేత్త శ్రీరామ్ పంచు లతో కూడిన త్రిసభ్య బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. ఇది సుప్రీoకోర్ట్ మొదటి ప్రయత్నం కాదు.  ఈ వివాదంపై మొదటినుంచి జరిగిన సంప్రదింపులు-చర్చల విఫల యత్నాలు ఈ క్రింద ఇస్తున్నాము.

  1. పరమపూజ్య శ్రీ చంద్రశేఖర సరస్వతి – మౌలానా అబ్దుల్ హాసన్ అలీ

సామరస్య పూర్వకంగా అయోధ్య సమస్యను పరిష్కరించేందుకు జరిగిన మొదటి ప్రయత్నం, కంచికామకోటి పీఠాధిపతులు పరమపూజనీయ స్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డు(AIMPLB) అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హాసన్ అలీల మధ్య 1986లో జరిగింది. అయితే ఆయనపై ఒత్తిడి మూలంగా స్వామి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి చర్చలనుంచి వైదొలగారు, కారణాలు వెల్లడి కాలేదు. అప్పటి హోంశాఖా మంత్రి శ్రీ బూటాసింగ్ హిందూ ముస్లిం ప్రతినిధుల మధ్య చర్చలు ఏర్పాటు చేసేవారు. ఒక సందర్భంలో, ఒక ముస్లిం ప్రతినిధి `అయోధ్య, కాశీ, మథుర ఇచ్చేస్తే, మరొక క్షేత్రాన్ని కోరకుండా ఉంటారా’, అని పూజ్య సాధువులు మరియు స్వామీజీలను అడగగా, సయ్యద్ షాహబుద్దిన్ `అసలు ముస్లిం ప్రతినిధులెవరు ఇవన్నీ ఇచ్చేయడానికి’ అని కోపగించుకున్నారు.

  1. వీపి సింగ్ ప్రభుత్వ త్రిసభ్య బృందం 1990

అయోధ్య కేసు కోర్టులో ఉండగా, వీపి సింగ్ ప్రభుత్వo చర్చల కొరకు త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసినా `బాబ్రీ మస్జిద్ ఏక్షన్ కమిటీ (BMAC)’ చర్చలను నిరాకరించింది. అలిమియా నద్వి, మరియు పూజ్య సాధువులు-స్వామీజీల మధ్య అరకొరగా మాత్రమే చర్చలు జరిగాయి. ఒకసారి ముస్లిమ్ ప్రతినిధుల నమాజ్ తరువాత, స్వామి సత్యమిత్రానందా, తమ ఉత్తరీయం.nth Re పరిచి నమాజ్ తరవాత ముస్లిములు సమర్పించే `జకత్’ కింద శ్రీరామజన్మభూమి ఇచ్చేయమని కోరారు. అయితే అదేమీ మిఠాయిడబ్బా కాదని వారన్నారు. ఒకసారి శ్రీ సయ్యద్ షాహబుద్దిన్, దేవాలయాన్ని ధ్వంసం చేసి మస్జిద్ నిర్మాణం జరిగిందని రుజువైతే, తాము ఆ స్థలం వదిలేసుకుంటాము అనగా, అయితే కాశీవిశ్వనాథ దేవాలయమే ఒక పెద్ద రుజువని దాన్ని వదిలేయమని సాధువులు అన్నారు. అపుడు షాహబుద్దిన్ తన మాటను వెనక్కి తీసుకున్నారు.  

  1. శ్రీ చంద్రశేఖర్ ప్రభుత్వం – పదిమంది సభ్యుల బృందం

ప్రధాని శ్రీ చంద్రశేఖర్ హయాంలో సంప్రదింపుల కోసం పదిమంది సభ్యుల బృందం ఏర్పడింది. అప్పటి హోంమంత్రి సుబోద్ కాంత్ సహాయ్ బృంద సంచాలకుడు కాగా,  AIMPLB, విశ్వహిందూ పరిషద్ (VHP), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భైరవ్ సింగ్ శేఖావత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్, చారిత్రక, పురావస్తు శాఖా నిపుణులు బృందంలో ఇతర సభ్యులు.

ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో VHP, BMAC సభ్యులు చర్చలు సాగించారు. శ్రీరామ జన్మభూమి మందిరం నిజంగానే కూల్చివేయబడి, దాని మీద వివాదిత కట్టడం ఉంటే, ఆ రుజువులు దొరికితే, ముస్లిములు తమ దావా వదులుకుంటారనే తరహాలో చర్చలు జరిగాయి. ఇరు వర్గాలు తమ ఆధారాలు లిఖిత రూపంలో హోంశాఖకు 22డిసెంబర్1990లోపు సమర్పించాలని, ఆయా అధారాలపై ఇరువర్గాలు తమ వ్యాఖ్యలను జతచేసి 6జనవరి1991లోపు పంపితే, హోంశాఖ వాటిని పరిశీలించి, సారూప్యత ఉన్న అంశాలు, విబేధాలున్న అంశాల జాబితా తయారు చేసి 9జనవరి1991లోపు ఇరువర్గాలకు పంపేటట్లు ఖరారైంది. చారిత్రక, పురావస్తు, రెవెన్యూ, న్యాయశాఖ  నిపుణులు 24జనవరి1991న ఆధారాలను పరీక్షించి, ఇరువర్గాలకు తమ విశ్లేషణలు వినిపిస్తారు. అనుకున్న విధంగా నిపుణులు రెండు బృందాలుగా సమావేశమయారు. ముస్లింవర్గం ఆధారాలు అధ్యయనం చేయడానికి ఆరువారాలు గడువు కోరగా, హిందూవర్గం 5ఫిబ్రవరి1991లోపు పని పూర్తవుతుoదని తెలియచేసారు. కొందరు ముస్లింవర్గ నిపుణులు సమావేశానికి రానందున, 25జనవరి1991 తిరిగి కలవాలని నిర్ణయమైంది. అయితే మిగతావారు ఎంతసేపు ఎదురుచూసినా వారు ఆ రోజు రాలేదు. దీన్నిబట్టి ముస్లింవర్గం చర్చలను తిరస్కరిస్తోందని అందరికీ అర్ధమైంది. దీనితో చర్చలు అంతమయాయి. చర్చలు జరిగిన కాలంలో కూడా, ముస్లింవర్గం మాటిమాటికి  మాట మారుస్తూ ఉండేది. కాంగ్రెస్ పార్టీ శ్రీచంద్రశేఖర్ ప్రభుత్వాన్ని పడదోయటంతో, చర్చల ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. 

  1. శ్రీ పివి నరసింహారావు ప్రభుత్వం – శ్రీ చంద్రస్వామి

1992లో అయోధ్యలో కరసేవకి VHP సమాయుత్తం అవుతుండగా, ప్రధాని శ్రీ పివి నరసింహారావు ప్రభుత్వం, శ్రీ రామజన్మభూమి వివాదంపై శ్రీ చంద్రస్వామిని చర్చలలో మధ్యవర్తిగా నియమించింది. ఆయన చర్చలు ప్రారంభించేముందే, కరసేవ మొదలవడం, 6డిసెంబర్1992న, వివాదాస్పద కట్టడం నేలకూలడం జరిగిపోయాయి.

  1. ఇస్మాయిల్ ఫారూకి తీర్పు

24 అక్టోబర్1994 తేదిన,`ఇస్మాయిల్ ఫారూకి తీర్పు’లో సుప్రీంకోర్ట్ ప్రధమంగా `చర్చలు-సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం’ జరిగితే ఇరువర్గాల సామరస్యానికి, ఈ దేశ ప్రజల సంతోషానికి, అభ్యున్నతికి మంచిదని, ఇటువంటి వ్యవహారంలో గెలుపు-ఓటముల ప్రసక్తి రాకుండా, సమస్యా పరిష్కారం జరగాలని కోరింది. అపుడు ఎవరి మనసుల్లోనూ ఎటువంటి అసంతృప్తి ఉండదని న్యాయస్థానం పేర్కొంది. ఈ అభిప్రాయానికి అపుడు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.  

  1. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం- అయోధ్య విభాగం

ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో ప్రధాని కార్యాలయంలో, IPSఅధికారి కునాల్ కిశోర్ ఆధ్వర్యంలో `అయోధ్య విభాగo’ ప్రారంభించి చర్చలకు శ్రీకారం చుట్టారు. అయితే చర్చలలో, ముస్లింవర్గం ఆ స్థలంలోనే మసీదు పునర్నిర్మాణంపై పట్టుపట్టగా, హిందూవర్గం శ్రీరామమందిర నిర్మాణానికై అదే స్థలాన్ని కోరింది. అయోధ్యలో వేరే ప్రదేశంలో మసీదు కట్టుకోవాలని చేసిన విజ్ఞ్యప్తిని ముస్లింవర్గం ఒప్పుకోలేదు.

  1. స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి

శ్రీకంచికామకోటి పీఠాధిపతులు పరమపూజనీయ స్వామి శ్రీజయేంద్ర సరస్వతి, 2002-03కాలంలో, AIMPLBమరియు ఇతర ముస్లిం వర్గాలతో, ఎన్నో సార్లు చర్చలు సంప్రదింపులు జరిపారు.  ఆయన ఆ స్థలం శ్రీరామజన్మభూమి కాబట్టి, అది వదిలేసి మరెక్కడైనా మసీదు కట్టుకోవాలని పలుమార్లు కోరారు. ముస్లిం వర్గాలు ఆయన విజ్ఞ్యప్తిని తిరస్కరించారు, కురాను ప్రకారం ముస్లిములు మసీదు స్థలాన్ని స్వచ్చందంగా వదులుకోలేరని, న్యాయస్థానం లేక భారత పార్లమెంట్ ఆదేశిస్తే, ఒప్పుకుంటామని BMAC తెలియచేసింది.  

  1. అల్లహాబాద్ ఉన్నత న్యాయస్థానం తీర్పు

30సెప్టెంబర్ 2010తేదిన అల్లహాబాద్ ఉన్నత న్యాయస్థానం, వివాదాస్పద కట్టడం క్రింద బయటపడిన దేవాలయ శిధిలాల ప్రామాణికతను అంగీకరిస్తూ, మందిరం ధ్వంసంచేసి మసీదు కట్టబడిందని తేల్చిచెప్పి, ఆ స్థలంలో 0.3 ఎకరాలు హిందువులకి అప్పచెప్పి, 1992లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, BMAC మరియు నిర్మోహి అఖాడాలకి చెరి సగం అప్పచెప్తూ, 2:1 మెజారిటీ తీర్పు వెలువరించింది.   

  1. స్వామి శ్రీ శ్రీ రవిశంకర్

వివాదాస్పద భూమి ఒక ఎకరం హిందువులకు ఇవ్వాలని, దానికి మారుగా ముస్లిములు ఐదు ఎకరాలలో పెద్ద మసీదు కట్టుకోవచ్చని, స్వామి శ్రీశ్రీరవిశంకర్, 6మార్చ్2018న AIMPLBకి లేఖ వ్రాసారు. ముస్లిములకి మక్కా-మదీనా లాగా, హిందువులకి అయోధ్య రామజన్మభూమి అని ఆయన గుర్తుచేశారు. హిందువుల తరపున న్యాయస్థానంలో అర్జీలు దాఖలు చేసిన ముగ్గురులో,`నిర్మోహి అఖాడా’ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోగా, మిగతా ఇద్దరు–హిందూ మహాసభ, రామలల్లా(బాలరాముడు)విరాజమాన్, రామజన్మభూమి స్థలంపై ఎటువంటి రాజీ కుదరదని తేల్చి చెప్పాయి. 

  1. శ్రీ జెఎస్ కేహర్, ప్రధాన న్యాయమూర్తి

బిజెపి ఎంపి శ్రీసుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన PILకేసుని 4ఏప్రిల్ 2017న వింటూ, ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, ఈ సమస్యపై మధ్యవర్తిత్వం జరిపించాలని, న్యాయస్థానం మధ్యవర్తిని నియమించగలదని, తాను స్వయంగా మధ్యవర్తిగా ఉంటానని సూచించారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. తదుపరి విచారణ 31మార్చ్ రోజున, డా. స్వామి, గతంలో జరిగిన ఎన్నో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమైనాయని, కాబట్టి అయోధ్య కేసుని త్వరితగతిన విచారణ చేసి పూర్తి చేయాలని కోరారు.      

  1. స్వామి శ్రీశ్రీ రవిశంకర్

 శ్రీశ్రీ రవిశంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగిఆదిత్యనాథ్ తో 15నవంబర్ 2017న సమావేశమైన తరువాత, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇరువర్గాలతో ఎన్నోసార్లు చర్చలు చేసారు.  శ్రీరామజన్మభూమి న్యాస్ మహంత్ నృత్యగోపాల్ దాస్, బాబ్రిమస్జిద్ స్థలవివాదం కేసు ఇక్బాల్ అన్సారీ, బాబ్రిమస్జిద్ కూల్చివేత కేసు హాజీ మెహబూబ్ లతో ఆయన చర్చలు జరిపారు. హిందూవర్గం రామమందిరం, ముస్లింవర్గం మసీదుని కోరారు. ముస్లిం మతాధికారి మౌలానా ఫరంగి మహాలిని శ్రీశ్రీ కలవగా, AIMPLBలో ఈ విషయం చర్చిస్తామని చెప్పారు.   

వివాదాస్పద భూమి ఒక ఎకరం హిందువులకు ఇవ్వాలని, దానికి మారుగా ముస్లిములు ఐదు ఎకరాలలో పెద్ద మసీదు కట్టుకోవచ్చని, స్వామి శ్రీశ్రీ రవిశంకర్ 6మార్చ్2018న AIMPLBకి లేఖ వ్రాస్తూ, దీనివల్ల ముస్లిములు 100కోట్ల హిందువుల అభిమానం పొందుతారని, రామమందిర శిలాఫలకంపై `హిందూ-ముస్లిముల సహకారంతో మందిర నిర్మాణం జరిగిందని’ వ్రాయిస్తామని, ఇది భారత ప్రజలకి వారిచ్చే బహుమతిగా భావించాలని కోరారు. కొందరు ముస్లిం ప్రముఖులు ఈ విజ్ఞ్యప్తిని అంగీకరించి సరయు నదికి అటుపక్క లేక లక్నోనగరంలో మసీదు కడతామని చెప్పారు. అయితే 14నవంబర్ 2017తేదిన, AIMPLB ఈ ప్రతిపాదనను త్రోసిపుచ్చి, సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తామని చెప్పింది.      

  1. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ బృందం

రామజన్మభూమి వివాదంపై 8మార్చ్ 2019 తేదిన, ఆంతరంగిక మధ్యవర్తిత్వం కోసం సుప్రీంకోర్టు, రిటైర్డ్ న్యాయమూర్తి ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా, అధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవేత్త శ్రీరామ్ పంచు లతో కూడిన త్రిసభ్య బృందాన్ని నియమించింది. 4వారాల్లో పరిస్థితి నివేదిక, 8వారాల్లో అంతిమ నివేదిక ఇవ్వాలని కోరింది. చర్చలు ఆంతరంగికoగా జరగాలని, మీడియా వార్తలు వ్రాయకూడదని ఆంక్షలు విధించింది. BMAC మధ్యవర్తిత్వాన్ని స్వాగతించింది.  హిందువుల తరపున న్యాయస్థానంలో అర్జీలు దాఖలు చేసిన ముగ్గురులో, `నిర్మోహి అఖాడా’ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోగా, మిగతా ఇద్దరు – హిందూ మహాసభ, రామలల్లా(బాలరాముడు)విరాజమాన్, రామజన్మభూమి స్థలంపై ఎటువంటి రాజీ కుదరదని తేల్చి చెప్పాయి. ముస్లింపక్ష అర్జీదారు ఇక్బాల్ అన్సారీ మొదట ఒప్పుకోకపోయినా, తరువాత సంప్రదింపులకి అంగీకరించారు.

 

Source: VSK Telangana