అయోధ్యలో వచ్చే నెల 5న రామ మందిర నిర్మాణానికి జరిగే భూమిపూజ కార్యక్రమంలో, అలాగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో దే శంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించా యి. నిరుడు ఆగస్టు 5నాడే ఆర్టికల్ 370 కింద కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా ను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమంలో ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) పథకం రూ పొం దించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇందు కోసం లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను ఐఎ్‌సఐ భారత్‌లోకి పంపించిందని పేర్కొన్నాయి.
వీవీఐపీలు లక్ష్యంగా కూడా ఇతర ప్రాంతాల్లో దాడులకు ఐఎస్‌ఐ పథకరచన చేసినట్లు తెలిసిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, కశ్మీర్‌లలో భద్రతాబలగాలను అప్రమత్తం చేశామని తెలిపాయి. అయోధ్యలో వచ్చేనెల ఐదున భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి