జకీర్ నాయక్ నుండి రాజీవ్ ఫౌండేషన్ కు రూ 50 లక్షలు 

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వివాదాస్పదమైన మత ప్రచారకుడు జాకిర్ నాయక్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ల మధ్య జరిగిన ఒక నగదు బదలాయింపును వెలికి తీసిన్నట్లు రిపబ్లిక్ టివి ప్రసారం చేసింది.

ఈ కధనం ప్రకారం ఇప్పుడు స్తంభింప చేసిన నాయక్ బ్యాంకు ఖాతా నుండి రూ 50 లక్షల నగదును రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కు యుపిఎ హయాంలో 2011లో బదిలీ చేసిన్నట్లు వెల్లడైనది. అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఈ ట్రస్ట్ ను సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ లతో 2002లో లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించారు.

ట్రస్ట్ ఆ డబ్బును 2011లో స్వీకరించినట్లు, జాకిర్ నాయక్ భారత్ నుండి తప్పించుకు వెళ్ళిన తర్వాత, ఎన్ ఐ ఎ ఆయనిపై ఒక కేసును నమోదు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చివేసిన్నట్లు కూడా వెల్లడించారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సోనియా గాంధీ చైర్మన్ కాగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మన్మోహన్ సింగ్, చిదంబరంలను ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫౌండేషన్ కు చైనా ఎంబసీ, చైనా ప్రభుత్వంలా నుండి లక్షలాది రూపాయలు స్వీకరించినట్లు తెలుస్తున్నది. ఫౌండేషన్ వార్షిక నివేదికల ప్రకారం 2006, 2008 సంవత్సరాల మధ్య ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి కూడా నిధులు సమకూరాయి. 

సోనియా గాంధీ నేతృత్వంలోని ఫౌండేషన్ కు చైనా ఎంబసీ, చైనా ప్రభుత్వాల నుండి నిధులు సమకూరినట్లు వచ్చిన ఆరోపణలపై `విదేశీ నిధులు’, ఆదాయ పన్ను చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలపై విద్వేష ప్రసంగాలు జాకిర్ నాయక్ చేయడం వెల్లడైనది. జాకిర్ నాయక్ విద్వేష ప్రసంగాలు చాలామంది ఉగ్రవాదులను భారత్, బాంగ్లాదేశ్ లలో, తాజాగా శ్రీలంకలో ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ప్రభావితం చేసిన్నట్లు ఎన్ ఐ ఎ, వివిధ రాష్ట్రాలలోని పోలీసులు సాక్ష్యాధారాలను సంపాదించారు.

శ్రీలంకలో 300 మందికి పైగా అమాయకుల హత్యలకు కారణమైన ఉగ్రవాదులు ఎక్కువగా జాకిర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారు. కేరళ, తమిళ నదులలో ఎన్ ఐ ఎ జరిపిన దాడులలో అటువంటి ఆరోపణలకు ఆధారాలు లభించాయి. ఢాకాలో 29 మంది చనిపోవడానికి కారణమైన ఉగ్రవాద దాడిలో కూడా అతని పేరు ప్రస్తావనకు వచ్చింది.

తనపై విద్వేష ప్రసంగాలు, మనీ లాండరింగ్ లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత 2016 నుండి నాయక్ భారత్ లో ఆరెస్ట్ లను తప్పించుకొంటూ వచ్చారు. భారత దేశం విలుపల మనీ లాండరింగ్ కు తన పీస్ టివి ఛానల్ ను ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

తిరిగి ఆగష్టు, 2019లో అతనిపై ఈడి మనీ లాండరింగ్ ఆరోపణలు దాఖలు చేయడంతో ముంబై కోర్ట్ విచారణకు తీసుకు రావడానికి అరెస్ట్ ను జారీ చేసింది.భారత్ తో సహా యుకె, కెనడా, బాంగ్లాదేశ్ వంటి పలు దేశాలలో కూడా నాయక్ ప్రసంగాలను నిషేధించారు. భారత్, శ్రీలంక లతో పాటు పలు దేశాలలో అతని పీస్ టివి ని కూడా నిషేధించారు.