హిమాలయ దేశాలను చైనా బెదిరించలేదు  

తూర్పు లడఖ్‌లో భారత్‌తో తీవ్రమైన ఘర్షణను ప్రేరేపించడంతోపాటు పొరుగు దేశాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న చైన. హిమాలయ దేశాలపై తన ఆధిపత్యాన్ని చూపించలేదని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మైక్ పాంపియో స్పష్టం చేశారు. లండన్‌లో బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌తో  జరిపిన చర్చల్లో చైనా ఒక ముఖ్యమైన భాగమని చెప్పారు.

“మీకు చట్టబద్ధమైన దావా లేని సముద్ర ప్రాంతాల కోసం మీరు దావా వేయలేరు. మీరు దేశాలను బెదిరించలేరు. హిమాలయాల్లోని దేశాల వారిని బెదిరించలేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయలేరు” అంటూ పాంపియో చైనాపై విరుచుకు పడ్డారు. పొరుగు దేశాల వారిని చైనా బెదిరించలేరని పాంపియో హెచ్చరించారు.

చైనా సహా అన్ని దేశాలు అంతర్జాతీయ వ్యవస్థల క్రమానికి అనుగుణంగా ఉండే మార్గాల్లో ప్రవర్తించేలా కలిసి పనిచేయవలసిన అవసరం ఉన్నదని భావిస్తున్నామన్నామని తెలిపారు. “మేము హాంగ్ కాంగ్ యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడాము. అలాగే దక్షిణ చైనా సముద్రంలో సైనికీకరణ లక్షణాలను బెదిరించడాన్ని చూశాము. భారత్‌తో ఘర్షణను ప్రేరేపించడాన్ని గమనించాము” అని పాంపియో చెప్పారు.

బ్రిటిష్ మాజీ భూభాగంలో చైనా విధించిన వివాదాస్పద భద్రతా చట్టానికి ప్రతిస్పందనగా హాంకాంగ్‌తో అప్పగించే ఒప్పందాన్ని యూకే నిలిపివేసిన కొన్ని గంటల తరువాత పాంపియో-రాబ్ మధ్య చర్చలు జరుగడం విశేషం. ముఖ్యంగా చైనాపై హాంకాంగ్‌కు సంబంధించిన నిర్ణయాలతోపాటు బ్రిటన్‌ 5 జీ నెట్‌వర్క్‌ల నుంచి హువావే సంస్థను నిషేధించినందుకు పాంపియో ప్రశంసించారు.