హైదరాబాద్ విశ్వవిద్యాలయంకు దేశంలో నాలుగో స్థానం

హైదరాబాద్ విశ్వవిద్యాలయంకు దేశంలో నాలుగో స్థానం

దేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో  హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఓహెచ్) నాలుగో స్థానం పొందింది. 2020 సంవత్సరానికి వీక్-హన్సా పరిశోధన సర్వేలో యుఓహెచ్ దక్షిణాదిలోని అగ్రశ్రేణి మల్టీ డిసిప్లీనరీ విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానం దక్కింది. 

`యుఓహెచ్ స్థిరమైన పురోగతి సాధిస్తోంది, మా అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది కృషి వల్లనే ఇది సాధ్యమైంది’ అని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు పొదిలి తెలిపారు. 

‘మేము కొన్ని అదనపు చర్యలను ప్రారంభించాం, ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమిసెన్స్ గా గుర్తించబడటానికి మాకు సహాయపడింది. మన వారికి ప్రపంచ విద్య ప్రమాణాలను అందించడంపై దృష్టి సారించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా స్థానాన్ని మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నాం’  అని ఆయన పేర్కొన్నారు.

వీక్-హన్సా పరిశోధన కోసం 600లకు పైగా ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి వాస్తవిక సమాచారాన్ని సేకరించింది. వాస్తవికతను  లెక్కించడానికి అక్రిడిటేషన్, మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు, అధ్యాపకులు, పరిశోధన, విద్యావేత్తలు, విద్యార్థుల నాణ్యత, పూర్వ విద్యార్థులు, నియామకాలు వంటి వివిధ పరిమితులను పరిశోధించారు.