హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. అక్కడ పనిచేస్తున్న 28 మంది భద్రతా సిబ్బందికి, మరో 20 మంది రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 347 మందికి నెగెటివ్‌గా వచ్చిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 28 పోలీసు సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు, మిగతా 20 మందిని ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రికి తదుపరి చికిత్స నిమిత్తం తరలించినట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవరానర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ ఫలితాల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

More Stories
కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు దిక్కులేదా రేవంత్ రెడ్డి!
భారతీయ హిందువులను వెనక్కి పంపిన పాక్
హరియాణాలో ఓట్లు చోరీ.. రాహుల్ ఆరోపణలను కొట్టేసిన ఈసీ