నటి, ఎంపీ సుమ‌ల‌త‌కు క‌రోనా పాజిటివ్

ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలతకు కరోనా సోకింది. సుమలత నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించి, కరోనా వైరస్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పిరావడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. 

దానికి సంబంధించి రిపోర్ట్ సోమవారం రాగా పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులకు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. 

తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు సినిమాల్లో నటించిన సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్ సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన విస‌యం తెలిసిందే.