హద్దు మీరు వ్యవహరించిన చైనా

బైజయ్ `జయ్’ పాండా 

“ఎథీనియన్ శక్తి పెరుగుదల,  స్పార్టాలో ఏర్పడిన భయం కారణంగా యుద్ధం అనివార్యమైనది” అంటూ సుమారు 2,500 సంవత్సరాల క్రితం గ్రీకు చరిత్రకారుడు తుసిడైడ్స్, వినాశకరమైన పెలోపొన్నేసియన్ యుద్ధం గురించి వ్రాశాడు. స్థిరపడిన శక్తులు,  కొత్తగా బలపడుతున్న శక్తుల మధ్య చరిత్రలో అటువంటి యుద్దాలు మరి కొన్ని ఉన్నాయి. 

అయితే అవన్నీ యుద్ధాలకు దారితీయలేదు. నేడు అమెరికా – చైనా, చైనా – భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త   పరిస్థితులలో   అటువంటి పరిస్థితే ఎదురవుతున్నది. .

“డెస్టినేడ్ ఫర్ వార్: కెన్ అమెరికా & చైనా ఎస్కేప్ తుసిడైడ్స్ ట్రాప్? ” అనే రేచ్ఛగొట్టే విధంగా ఉన్న 2017నాటి తన గ్రంధంలో , హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గ్రాహం అల్లిసన్ ఇలా వ్రాశాడు: “ఒక గొప్ప శక్తి మరొకరిని స్థానభ్రంశం చేస్తానని బెదిరించినప్పుడు, యుద్ధం దాదాపు అనివార్యం”. చరిత్రలో ఇటువంటి 16 సంఘర్షణలను ఉదహరిస్తూ, అందులో నలుగురు మాత్రమే యుద్ధం లేకుండా పరివర్తనను దోహదపడ్డారని పేర్కొన్నాడు. 

అయినప్పటికీ, యుద్ధం అనివార్యం కాదు. అల్లిసన్ ఉదహరించిన విజయవంతమైన ఉదాహరణలలో, ఈ క్రింది రెండు ఆసక్తికరమైనవి. మొదట, ఒక శతాబ్దం క్రితం, యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) ను ప్రపంచంలోని సూపర్ పవర్‌గా అమెరికా అధిగమించింది. అప్పటికే శక్తివంతంగా ఉన్న యుకె తో వ్యవహరించడంలో  ఇరువైపులా రాజనీతిజ్ఞత, చర్చల నైపుణ్యం ప్రదర్శించారు. 

రెండవ విధానంలో భిన్నమైన వ్యూహం అనుసరించారు.  ఇక్కడ శక్తివంతమైన దేశంగా ఎదిగిన అమెరికా, అందుకు పోటీగా శక్తివంతంగా ఆవిర్భవించిన యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యుఎస్ఎస్ఆర్) దశాబ్దాలుగా ఒకరినొకరు ఆధిపత్యం కోసం పోటీ పడుతూనే ఉన్నారు. అయితే  వారు ఎన్నడూ యుద్దానికి  వెళ్ళలేదు.

ఆధునిక కాలంలో పూర్తి స్థాయి యుద్దాన్ని నివారించడానికి ఏర్పడిన విజయవంతమైన సాధనం  ప్రచ్ఛన్న యుద్ధం. అగ్ర రాజ్యాల మధ్య ఘర్షణలో మొదటగా అణ్వాయుధాలు కూడా చోటు చేసుకోవడంతో అదొక్క మంచి పరిణామంగా మారింది. 

అమెరికాకు సంబంధించి చైనా శక్తివంతంగా ఎదగడం గతంలో దశాబ్దాల తరబడి యుకె – అమెరికాల మధ్య నెలకొన్న పోటీ వంటిదే. కానీ ఈ మధ్య కాలంలో రెండో వ్యూహంలో అమెరికా –  యుఎస్ఎస్ఆర్ మధ్య నెలకొన్న పరిస్థితులకు దారితీస్తున్నది. భారత్ కు సంబంధించి చైనా విధానం ఎప్పుడూ రెండో విధంగానే ఉంది. 

యుఎస్ఎస్ఆర్ తో అమెరికా శత్రుత్వం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో, 1970 దశకం ప్రారంభంలో చైనా పేదరికం నుండి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్న తరుణంలో రిచర్డ్ నిక్సన్ హయాంలో చైనా అమెరికా వైపు తిరగడం ప్రారంభమైనది.

 అయితే యుఎస్ఎస్ఆర్ ను ఎదుర్కోవటానికి కాకుండా తన స్వార్ధ ప్రయోజనాల కోసమే అమెరికా ఈ విధంగా చేసింది. తమ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్ పొందటం కోసం, చౌకగా దిగుమతులను చేసుకోవడం కోసం చేసింది. 

అంతకుముందు అమెరికా పాలకులు భారతదేశంతో కూడా అటువంటి ప్రయత్నం చేశారు. అయితే  స్వేచ్ఛా మార్కెట్ల పట్ల  నెహ్రు విధానాలు అనుసరిస్తున్న భారత దేశం విముఖత వ్యక్తం చేసుకోవడంతో పాటు,  పశ్చిమ దేశాల వలసరాజ్య అనంతర అనుమానాలను తొలగించడంలో విఫలం కావడంతో సాధ్యం కాలేదు. 

ఇప్పుడు అపోహాలు తొలగి పోయినా, ఆ సమయంలో చైనా సంపన్నమైతే నిరంకుశత్వం తగ్గి, బహిరంగ సమాజంగా మారుతుందని ఆ సమయంలో పాశ్చాత్య దేశాలు భావించాయి. ఈ సంబంధం దశాబ్దాలుగా పరస్పరం ప్రయోజనకరంగా ఉండగా, ఇటీవలి సంవత్సరాలలో, ఇది గణనీయంగా సన్నగిల్లింది.

తర్వాత చైనా ప్రపంచంలో మూడవ, రెండవ అతిపెద్ద ఆర్ధిక  ఆర్ధిక వ్యవస్థగా అవతరించడంతో,  క్రమంగా తనకు ప్రయోజనం పొందిన విధానాలను అనుసరించడం మానివేసింది. ఆర్ధిక, సైనిక ఆధిపత్యాలను ప్రదర్శించడం ప్రారంభించింది. అధ్యక్ష పదవి చేపట్టిన చాలాకాలం తర్వాత నిక్సన్ చైనా గురించి స్వయంగా  ఇలా అన్నాడు:  “మేము ఫ్రాంకెన్‌స్టైయిన్ రాక్షసుడిని సృష్టించాము.” 

భారతదేశం పట్ల చైనా విధానం ఎల్లప్పుడూ మనల్ని నియంత్రించే విధంగా ఉంటూ వచ్చింది. 1940 ల నుండి, రెండూ దేశాలు కూడా కొత్తగా, వలస రాజ్యాల నుండి బైట పది,  రెండవ ప్రపంచ యుద్ధానంతర యుగంలో ఉద్భవించినవి  కావడంతో ఆ దేశం భారత దేశాన్ని ఎప్పుడూ దీర్ఘకాలిక పోటీదారుగా చూస్తూ వస్తున్నది. ఈ దేశాన్ని కట్టడి చేయవలసిందే అంటూ భావిస్తున్నది. 

అందువల్ల, చేతికి అందిన ప్రతి సాధనాన్ని ఉపయోగించుకొని,  సాధ్యమయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని ఒత్తిడికి గురిచేయడం, దాని  అభివృద్ధిని కట్టడి చేసే విధంగా  చేస్తూ వస్తున్నది. 1950 దశకం ప్రారంభం నుండి పాకిస్థాన్ ను ప్రోత్సహించడం ద్వారా, భారత్ కట్టడికి ఆ దేశాన్ని   ఉపయోగించుకొంటూ వస్తున్నది. 

దాదాపు అర్ధ శతాబ్దం పాటు భారత్‌తో వాస్తవ ఆధీన రేఖ (ఎల్‌ఐసి) లో నియంత్రణను  ఏర్పాటు చేస్తున్నప్పుడు, చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను పెంచడం ప్రారంభించింది. ఆగ్నేయ ఆసియా నుండి ఆఫ్రికా వరకు భారతదేశాన్ని చుట్టుముట్టడానికి “ముత్యాలహారం” వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది.

శ్రీలంక , పాకిస్థాన్ లలోని  హంబంటోటా, గ్వాడార్ ఓడరేవులు; బెల్ట్ – రోడ్ పక్రియ,  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్ వంటి ప్రాజెక్ట్ లను చేపట్టడం ద్వారా ఇటీవల కాలంలో చైనా వేగంగా అడుగులు వేస్తున్నది.

మరీ ముఖ్యంగా, నేపాల్‌లో ఇటీవలి పరిణామాలు చూపించినట్లుగా, పాకిస్తాన్ తరహా అనుకూల దేశాలను భారతదేశం తక్షణ పొరుగు  దేశాలలో ఏర్పరచే  ప్రయత్నాలను చైనా తీవ్రంగా  చేస్తున్నది.  ఇటీవలి సంవత్సరాలలో చైనా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా సమీప, దూర దేశాలపై ఆధిపఃత్య ధోరణులు ప్రదర్శించడం పెంచింది.

మరోవంక భారతదేశం కూడా మారుతోంది. ఇది అంతకుముందు చైనా వలే సరిహద్దు రక్షణ పట్ల తగు దృష్టి కేంద్రీకరించకుకండా దశాబ్దాల కాలం పాటు వాస్తవ అధీన రేఖ చట్రంలో కాలాన్ని వృథా చేసింది.  అయితే సరిహద్దు రాష్ట్రాల్లో పౌర, రక్షణ రంగాలలో  మౌలిక సదుపాయాల వ్యయంను భారీగా  పెంచడం ద్వారా భారత్  2014 నుండి తన ధోరణిని గణనీయంగా మార్చుకొంది. 

చాలా మంది వ్యాఖ్యాతలు గుర్తించినట్లుగా, వాస్తవ ఆధీన రేఖ వెంబడి భారతదేశం వైపు ఇటీవల మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తూ ఉండటం ప్రస్తుత ఘర్షణకు కీలకమైన ప్రేరకంగా నెలకొంది.  చైనాతో సమానంగా ఉండాలనే ప్రయత్నిస్తున్న భారత్ ను భయపెట్టే ప్రయత్నం ఆ దేశం చేసింది.

మోదీ ప్రభుత్వం విదేశాలలో చైనా అనుసరిస్తున్న విధంగా పలు చర్యలు తీసుకొంటున్నది. ఉదాహరణకు, దశాబ్దాల ఆలస్యం తరువాత చివరకు ఇరాన్‌లో చాబహార్ నౌకాశ్రయాన్ని ప్రారంభించింది. 

మితిమీరి వ్యవహరించిన చైనా భారత దేశపు ధృడమైన ధోరణిని చూసి ఈ పర్యాయం చైనా షాక్ కు గురైనది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం కౌటిల్య   సూత్రాలను  అనుసరించి ఉంటున్నది. పూర్వపు పాలకుల వలే కాకుండా, ప్రత్యర్థుల శాంతి మాటలతో రక్షణ అంశాలను వదిలి వేయడం  వారి వలెనే శాంతిని కోరుకొంటూనే, క్రమంగా బలం పెంచుకొని ఆత్మ విశ్వాసంతో నిలబడుతున్నారు. 

(బైజయంత్ “జయ్” పాండా బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు) 

.