పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌ బదిలీ

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమి డైరెక్టర్ వీకే సింగ్ పై బదిలీ వేటు పడింది. డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
తెలంగాణ పోలీస్‌ అకాడమీ ఇన్‌చార్జ్‌గా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. 
 
కాగా గత కొంత కాలంగా  ప్రభుత్వంపై వీగే సింగ్ అసంతృప్తిలో ఉన్నారు. తాను చేసిన సేవలకు ప్రభుత్వం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ వార్తలకెక్కారు. 
 
ఈ క్రమంలో ఈనెల 24న కేంద్ర హోం శాఖ మంత్రికి ఫ్రి మెచ్యూర్ రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు.
 ఈ లేఖలో వీకే సింగ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.