నాసా నుండి సూర్యుని అద్భుతమైన వీడియో

నాసా సూర్యుని అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. ప్రతి సెకనుని ఒక రోజుగా పరిగణిస్తూ దశాబ్దకాలాన్ని గంటకు కుదించడంతో పాటు సూర్యునిలో చోటుచేసుకున్న పెనుమార్పులను ఒక క్రమానుసారంలో వీడియోలో పొందుపరిచింది. 

ఈ వీడియోను ‘నాసా’ సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌డిఒ) విడుదల చేసింది. దశాబ్దకాలంగా సూర్యుడిలో కలిగే మార్పులను పర్యవేక్షిస్తోందని, భూమిసూర్యుని చుట్టూ తిరగుతున్న సమయంలో ఎస్‌డిఒ సూర్యుని 425 హై రిజల్యూషన్‌ చిత్రాలను సేకరించిందని ఈ వీడియోను విడుదల చేస్తూ నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. 

టైమ్‌ ల్యాప్స్‌ వీడియో సూర్యుని 11 ఏళ్ల సౌర చక్రంలో భాగంగా సంభవించే మార్పులను చూపించిందని, దీంతో సూర్యుని గురించి, సౌరవ్యవస్థను గురించి అధ్యయనం చేసేందుకు వినియోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. 

నాసా ప్రకారం సూర్యుని అయస్కాంత క్షేత్రం ఒక భ్ర‌మ‌ణం పూర్తి చేస్తే దానిని  సౌర‌చ‌క్రంగా పిలుస్తా‌ర‌ని, ప్ర‌తి 11 ఏళ్ల కొకసారి ఈ అయస్కాంత క్షేత్రం మారిపోతుందని, దీంత ఉత్తర, దక్షిణ ధ్రువాలు మారతాయని తెలిపింది. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్‌ గిగాబైట్ల డేటా ఖర్చయిందని వివరించింది.