చెక్కు చెదరిని ప్రధాని మోదీ పట్ల ఆదరణ 

లడఖ్ సరిహద్దులో గల్వాన్‌ లోయలో భారత- చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చైనా వివాదంపై సీ-ఓటర్ స్నాప్ పోల్‌ల నిర్వహించింది. 

ప్రస్తుత ఉద్రిక్తతపై ప్రభుత్వమా? లేక ప్రతిపక్షమా? ఎవరు నమ్మకంగా ఉన్నారంటూ ప్రజలను ప్రశ్నించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది తమకు మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉన్నదని చెప్పగా.. 14.4 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీ లేదా ప్రతిపక్షంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో 9.6 శాతం మంది ప్రజలు చైనాతో వివాదాన్ని పరిష్కరించే దమ్ము అటు ప్రతిపక్షంలో గానీ, ఇటు ప్రభుత్వంలో గానీ లేదని పేర్కొన్నారు. చైనీస్ వస్తువులను బహిష్కరించాలని 68 శాతం మంది ప్రజలు కోరుతుంగా,  31 శాతం మంది చైనా వస్తువులను కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. 

సర్వే చేసిన 68 శాతం మంది పాకిస్తాన్ కంటే చైనా నుంచే ముప్పు ఎక్కువగా ఉన్నదని చెప్పగా, 32 శాతం మంది పాకిస్తాన్‌ పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. చైనాపై స్పందించడానికి భారత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొన్నదని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు 39 శాతం మంది అవును అని ప్రతిస్పందించారు. 

గల్వాన లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన తరువాత మోదీ ప్రభుత్వం చైనాకు తగిన రీతిలో సమాధానం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. కాగా భారతీయ సైనికుల హత్యకు ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదని 60 శాతం మంది చెప్పడం విశేషం.