కరోనా మందును కనిపిట్టమని పతంజలి సంస్థ ప్రకటించడంతో పాటు, ఆ మందును బాబా రామ్ దేవ్ విడుదల చేసిన కొద్దీ గంటలకే కేంద్రం చెక్ పెట్టింది.
కోవిడ్-19ను నయం చేసే మందుగా పతంజలి చెప్పుకొస్తున్న ఈ మందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని ఆదేశించింది. ఈ మందుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను.. ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారో, ఈ మందు వేటితో తయారైందో, నమూనాల పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే పతంజలి తయారుచేసిన కొరోనిల్ వాడితే రెండు వారాల్లో కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. 150కి పైగా ఔషధ మొక్కలను ఈ మందును తయారుచేసేందుకు వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది.
ఈ కరోనా కిట్ ధరను రూ 545 గా నిర్ణయించినట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలక్రిష్ణ ప్రకటించారు. పతంజలి స్టోర్ట్స్ లో మాత్రమే ఈ మందు దొరుకుతుందని సంస్థ ప్రకటించింది.
More Stories
జాతీయ రహదారులపై క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్
50 మంది సీనియర్ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం