ఎస్‌.కోట ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీన్ని ఎమ్మెల్యే కూడా ధ్రువీకరించారు. ఆయన విశాఖలోని తన ఇంటిలోనే ఐసోలేటెడ్‌గా ఉంటున్నట్టు తెలుస్తున్నది. 
 
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అత్యవసర పనిపై అమెరికా వెళ్లి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని తెలిపారు.  కాగా, ఆయన ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లోనూ పాల్గన్నారు. దానితో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 ఏపీలో కరోనాకు గురైన  మొదటి ఎమ్యెల్యే. తెలంగాణాలో ముగ్గురు గురయ్యారు. ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాలలో మరికొందరు కరోనాకు గురైనా గోప్యంగా చికిత్స చేయించుకున్నట్లు కూడా చెబుతున్నారు.
 
ఇలా ఉండగా, ఏపీలో . సోమవారం కొత్తగా 443 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372కి చేరుకుంది. ఇక రాష్ట్రంలో తాజాగా ఐదు మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 111కి ఎగబాకింది.