మరోసారి భద్రతా మండలిలో భారత్ 

ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్  మరోసారి తాత్కాలిక సభ్యత్వాన్ని దక్కించుకుంది.  బుధవారం జరిగిన ఎన్నికల్లో  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. 2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు (2021–22) భద్రతా మండలిలో  భారత్‌ కొనసాగనుంది.

193 మంది సభ్యుల సర్వసభ్య సమావేశంలో 184 ఓట్లను గెలుచుకున్న భారతదేశం రెండేళ్ల కాలానికి శక్తివంతమైన ఈ మండలిలో తాత్కాలిక సభ్యురాలిగా ఎన్నికైంది. భారత్‌తో పాటు, ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించాయి. కెనడా మాత్రం ఓడి పోయింది.

55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్‌ గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌ ప్రతిష్టాత్మక భద్రతా మండలిలో నిలిచింది. భారత్‌  1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో ఏడుసార్లు తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది.