ఎల్జీపాలిమార్స్ బాధిత గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు  

ఎల్జీపాలిమార్స్ బాధిత గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు  
ఎల్జీపాలిమార్స్ బాధిత గ్రామాల్లో హైలెవెల్ మెడికల్ టీమ్ వచ్చి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ పివి మాధవ్ డిమాండ్ చేశారు. హానీకరం కాని పరిశ్రమలను నడిపించాలని సూచించారు. 
 
విశాఖపట్నంలో  కేంద్ర ప్రభుత్వ పాలనా విజయాలపై కరపత్రం విడుదల చేస్తూ  బాధిత గ్రామాల్లో రక్షిత మంచినీటిని ప్రత్యేక పైప్‌లైన్లతో సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలేరు కెనాల్ మీదుగా వచ్చే నీటిని కొంత బాధిత గ్రామాలకు మళ్లించాలని సూచించారు. 
 
 ఇదే సందర్భంగా తమ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి మాధవ్ మాట్లాడుతూ జనజాగరణ అభయాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కోవిడ్ నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద తిరిగి సొంతూళ్లకు వచ్చిన వారికి జాబ్ కార్డులిస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఎమ్మెస్‌ఎమ్‌ఈలకు హామీ లేకుండా రుణాలిస్తామని చెప్పారు. ఫార్మాగేట్‌ను బలోపేతం దిశగా కోల్డ్ కార్గో చేస్తున్నామని తెలిపారు. మదనపల్లి టమాలోను ఢిల్లీకి పంపించైనా వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. దేశీయ పరిశ్రమలకు భరోసా ఇచ్చే రీతిలో ప్రణాళికలు వేస్తున్నామని,  జీడీపీని స్థిరీకరిస్తామని మాధవ్ వివరించారు.