
అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఉన్న కుబేర్ టీలా వద్ద పరమశివుడికి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి కమల్ నయన్ దాస్, ఇతర పండితులు బుధవారం ప్రత్యేక పూజలు చేసి రుద్రాభిషేకం జరిపారు. అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమాలు త్వరగా ప్రారంభం కావాలని ప్రార్థించానని కమల్ నయన్ దాస్ చెప్పారు.
కుబేర్ తిల ఆలయంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంతి నృత్య గోపాల్ దాస్ అధికార ప్రతినిధి కమల్ నయన్ దాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 మంది పూజార్లు ఈ అభిషేకంలో పాల్గొన్నారు. గుడి నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడాలని ఆ శివున్ని కోరుతూ ఈ రుద్రాభిషేకం నిర్వహించామని వారు తెలిపారు. లంకపై దాడికి బయలుదేరే ముందు శ్రీరాముడు నిర్వహించిన రుద్రాభిషేకాన్నే ఇప్పుడు కూడా అనుసరించారు.
పూజా కార్యక్రమాలు జరిగాక శంకుస్థాపనతో మందిర నిర్మాణ పనులు మొదలవుతాయని కమల్ నయన్ దాస్ సోమవారం తెలిపారు. అయితే, బుధవారం ఆయన జన్మభూమి స్థలంలోని శివుడి గుడికి చేరుకున్నా ఇతర ట్రస్ట్ సభ్యులు హాజరు కాలేదు.
దీంతో మణిరామ్ చాన్వీ దేవాలయ పండితులతో కలిసి కమల్ నయన్ దాస్ పూజలు మాత్రమే చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపలేదు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ప్రాథమిక పనులు ప్రారంభం అవుతాయని, ప్రధాన పనులు మొదలయ్యేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం