
ఐక్యరాజ్యసమితి అసోసియేషన్ ఫర్ డెవలఫ్‌మెంట్ అండ్ పీస్ (యుఎన్‌ఎడిఎపి) ‘గుడ్‌విల్ అంబాసిడర్ టు ద పూర్’ గా తమిళనాడు మదురైలోని సెలూన్ యజమాని కుమార్తె ఎం నేత్రా (13) ఎంపికైంది.
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో రోజువారి కూలీలు, వలస కార్మికులు తమ జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరి బాధలు చూసి చలించిన నేత్ర తన చదువు కోసం తండ్రి దాచిన రూ. 5 లక్షల నగదును పేదల సహాయం నిమిత్తం ఇచ్చేందుకు తండ్రిని ఒప్పించింది. నిరుపేదలను ఈ నగదుతో ఆదుకుంది.
బాలిక దాతృత్వాన్ని ఆ తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు అభినందించారు. విద్యార్థినికి జయలలిత అవార్డును ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి పళనిస్వామికి సిఫార్సు చేశారు.
కొద్దీ రోజుల క్రితం మన్ కీ బాత్ రేడియో ప్రొగ్రాంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం బాలికను, ఆమె తండ్రిని మెచ్చుకున్నారు. మధురైకు గర్వకారణమని ప్రశంసించారు. తన జీవితకాలం మొత్తం వెచ్చించి కూడబెట్టిన డబ్బులను పేదలకు పంచడం గొప్ప విషయమని కొనియాడారు.
ఐరాస నేతలతో సమావేశమయ్యేందుకు, ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి అవకాశం లభించినందుకు తాను సంతోషిస్తున్నానని ప్రధాని చెప్పారు. నేత్ర త్వరలోనే న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో, జెనీవాలో జరిగే సివిల్ సొసైటీ ఫోరం సదస్సులో మాట్లాడనున్నట్లు ప్రధాని తెలిపారు.
ఈ హోదాలో నేత్ర ప్రపంచంలోని నేతలు, వి ఆమెకు ద్యా వేత్తలు, రాజకీయ నేతలు, పౌరులతో మాట్లాడేందుకు పేదలకు సహాయం చేసేలా ప్రోత్సహించేందుకు కూడా అవకాశం కల్పిస్తుందని యుఎన్‌ఎడిఎపి తెలిపింది. దీనిలో భాగంగా బాలికకు డిక్సన్ స్కాలర్‌షిప్ కింద రూ. లక్ష బహుమతి లభిస్తుంది.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం