కరొనపై పోరులో ఒక పేద మహిళ ఔదార్యం!

లాక్ డౌన్ కారణంగా ఒకవంక జీవనోపాధి కష్టమైనా, కుటుంభం గడవటమే కష్టంగా ఉన్నప్పటికీ కరొనపై పోరు చేస్తున్నవారికి అండగా ఉండాలని, కరొనతో విపత్తులు ఎదుర్కొంటున్న వారికి చేతనైన సహాయం చేయాలనీ ఒక పేద మహిళా చూపిన ఔదార్యం ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది.

కర్నాటక లోని భాగల్కోటి నగరంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ గా ఉండే వీథిలో లాక్ డౌన్ సమయంలో ఇళ్లు గడవడం ఒక మహిళకు కష్టంగా మారింది. తల్లిదండ్రుల నుండి, అన్న దమ్ముల నుండి సహాయం దొరకదు. బంధువుల సహాయం అసలే లేదు.  చుట్టు పక్కల వారి సహాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చేది. అంతటి కష్టంలో  కూడా ఎదుటివారి కష్టాలు తన కష్టాలుగా భావించి సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ వట్టి చేతులతో పంపలేదు.

ఈ లాక్ డౌన్ పరిస్తితుల్లో ఆమె ప్రతి నిత్యం పోలీసుల నుండి తప్పించుకుని,, 38 -42 డిగ్రీల ఎండల్లో రెండు కిలోమీటర్ల దూరం నడిచి  పనికి వెడుతూ ఉండెడిది. పొరపాటున పోలీసుల కళ్ళల్లో పడితే తిట్టించుకొంటూ ప్రతి రోజూ ఒక యుద్దానికి వెళ్లినట్టుగా ఉండేది ఆమె పరిస్తితి.

ఇంత కష్టంలో కూడా ఎవరి ముందూ నోరు తెరిచి అడగలేదు. తరువాత ఆమె కష్టాల గురించి తెలుసుకొని పోలీసులు ఆమెను ఏమి అనేవారు కాదు. ఇన్ని కష్టాలు పడి ఇంటికి రాగానే ఇంట్లో పని. చచ్చిపోవాలనిపించేది. కాని తను చచ్చి పోతే తన మీద ఆధారపడే వాళ్ళ గురించి ఆగిపోయేది.

అదే సమయంలో ఆమె పుట్టినరోజు కూడా వుండడంతో ఈ కష్టకాలంలో ఆపదలో ఉన్నవారికి తనకు చేతనైన సహాయం చెయడానికి ఆమె సిధ్ధపడినది. ఆయితే ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు వొప్పుకొరని తనే ఒక నమ్మకమైన  కరోనా గురించి పనిచేసే వ్యక్తి కి కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించినది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పని పనిచేసే  ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకుల గురించి విని, వాళ్ళల్లో ఎవరికైనా డబ్బు ఇవ్వాలని అనుకుంది.

రెండు రొజుల  ప్రయత్నించి, ఒక స్వయం సేవక్ ను కలిసి  తను ఇతరుల కోసం దాచుకొన్న డబ్బు అతని చేతిలో పెట్టి  వెళ్లిపోయింది. ఆ స్వయం సేవకునికి ఆశ్చర్యం వేసింది. ఎవరీమె? ఎందుకు ఈ డబ్బు ఇచ్చినది? ఎవరి కోసం? అని చాలాఆలోచించి మరల తన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. తరువాత కొంతసేపటి ఫోన్ చేసి ఆ డబ్బు అవసరమైన పేద వాళ్ళ   సహాయం కోసం ఉపయొగించమని చెప్పింది.

ఆమె ఇచ్చిన డబ్బు రూ 5,500. ఇది ఆమె ఒక నెల కష్టపడి సంపాదించిన డబ్బు. కొంచెమే అయినా ఆమెకు ఉన్న సేవా భావం చాలా గొప్పది. తను సంపాదించిన డబ్బు ఇచ్చేస్తే మరి మీకు అని అడిగితే నాకు దేవుడున్నాడు. మీలాంటి స్వయం సేవకుల ముందు నా సేవ గొప్పది కాదు అంటుంది. ఆమెకు సేవ చేశాననే కొంచం కూడా గర్వం లేదు. ఈమె యొక్క ఈ సేవా భావాన్ని అందరికీ తెలియజేయాలని ఆమె పేరు, అడ్రస్, ఫొటో  మిగితా వివరాలు అడుగుతే చెప్పడానికి నిరాకరించింది.

అంతే కాకుండా ఇంకా నా నుండి మీకు ఏదైనా సహాయం అవసరం అయితే ఏ సమయం అయినా టెలియజేయండి అంటూ తనకు చేతనైనది తప్పకుండా చెస్తానని మాట కూడా ఇచ్చింది. ఆమె అంకితభావం చూసి ఆ స్వయం సేవకుని కంట్లో నీళ్ళు ధారా పాతంగా వర్షించాయి.

( కన్నడ వెబ్ పోర్టల్ న్యూస్13.ఇన్ నుండి)