త్వరలో పెట్రోల్, సీఎన్ జీ హోం డెలివరీ?

 

పెట్రల్, సీఎన్ జీ హోం డెలివరీ కోసం ఆయిల్ కంపెనీలకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి.దీనికి సంబంధించి దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల కారణంగా వాహనాల యజమానులకు సాయం చేస్తామని పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన పేర్కొనడం గమనార్హం.

ఇస్తున్నాయి. ‘ప్రజలు భవిష్యత్ లో ఫ్యుయల్ ను హోం డెలివరీ చేసుకోవచ్చు. పెట్రోల్ తో పాటు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (ఎల్ఎన్ జీ)కి కూడా దీన్ని విస్తరిస్తాం’ అని ధర్మేంద్ర చెప్పారు. కాగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2018లోనే మొబైల్ డిస్పెన్సర్స్ ద్వారా కొన్ని ఎంపికైన నగరాలలో డీజిల్ ను హోం డెలివరీ చేసింది.

ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆయిల్ వాడకందారు అయిన భారత్ లో  లాక్ డౌన్ కారణంగా ఇంధనం డిమాండ్ భారీస్థాయిలో పడిపోయింది. ఏప్రిల్ నెలలో దేశంలో ఇంధనం వాడకం దాదాపుగా 70%కి పైగా పడిపోయింది. నిరుటితో పోల్చుకుంటే పెట్రోల్ యూజేజ్ కూడా 47%, డీజిల్వినియోగం 35 శాతం తగ్గిందని తేలింది.

ఈ మధ్యనే రెపోస్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీ మొబైల్ పెట్రోల్ పంప్స్ తో ఫ్యుయల్ హోం డెలివరీ చేస్తామని ప్రకటించింది. టాటా గ్రూప్ మద్దతుతో రతన్ టాటా సారథ్యంలో పూణే బేస్డ్ గా కార్యకలాపాలు నడిపిస్తున్న ఈ కంపెనీ 3,200 పెట్రోల్ పంపులను  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.