“జీవందన్ కార్యక్రమాన్ని 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు చేరేలా చూడటం ఈ కార్యక్రమం అని తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. 2024లో తెలంగాణ 188 మంది బ్రెయిన్ డెడ్ దాతల నుండి అవయవాలను సేకరించి 725 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిందని, అనేక మంది ప్రాణాలను కాపాడిందని మంత్రి వెల్లడించారు.
బ్రెయిన్ డెత్ అయిన సందర్భాల్లో అవయవాలను దానం చేయడానికి ముందుకు రావాలని, తద్వారా అవి వృధా కాకుండా నిరోధించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఆరోగ్యశ్రీ పథకం కింద అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తున్నామని, ఈ ప్రాణాలను రక్షించే విధానాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి ధృవీకరించారు.
జీవన్‌దాన్ ద్వారా కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దానం అవుతున్నాయి. కంటి కార్నియాలు, క్లోమాలు కూడా లబ్దిదారులకు అందుతున్నాయి. ఇది మరొకరికి ప్రాణవాయువు అవుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో చైతన్యం పెరిగింది. మరణించిన వారి కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా అవయవదానం రేటు 0.8 మాత్రమే. కానీ తెలంగాణలో ఇది 4.88గా నమోదైంది. ఇది రాష్ట్ర విశిష్టతను తెలియజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న అవగాహన కార్యక్రమాలు ఫలప్రదంగా ఉన్నాయి. ఆసుపత్రులు, అధికారులు, సంస్థల మధ్య సమన్వయం బాగుంది. అందువల్లే ఈ ప్రగతి సాధ్యమైంది. అవయవాల కొరతను తగ్గించడంలో తెలంగాణ ముందుంది. ఇతర రాష్ట్రాలు ఈ నమూనాను అనుసరించవచ్చు. ఇది ప్రాణాలు నిలబెట్టే మార్గంగా మారుతుంది.

More Stories
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు
లైంగిక వేధింపులలతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం