సంస్కార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో మాసం ట్యాంక్ లోని జేఎన్ఎఫ్ఏయు క్యాంపస్ లో వందేమాతరం “ఆర్ట్ ఎగ్జిబిషన్”ను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చిత్రకళా రంగంలో ఉన్నటువంటి 23 మంది నిష్ణాతుల ప్రదర్శనలతో పాటు సూర్య గ్లోబల్ స్కూల్ బాచుపల్లి విద్యార్థుల ప్రదర్శనలను సంస్కార భారతి కూకట్ పల్లి జిల్లా ఆధ్వర్యంలో వందేమాతరం చిత్రాకళా పెయింటింగ్స్ ని ప్రదర్శించారు.
ఈ అర్ట్ ఎగ్జిబిషన్ ను ముఖ్యఅతిథి శ్రీమతి దాస్యం గీతా భాస్కర్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా, ప్రాంత కార్యాధ్యక్షులు డా. కె కె వి శర్మ ఈ ప్రదర్శన ఉద్దేశాలను, భావాన్ని వివరించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం ఎల్ ఆనంద్, డా. రోహిణి అయ్యంగార్ వాడపల్లి, జి మల్లేశం, బోల్గం నగేష్ గౌరవ అతిధులుగా పాల్గొని ఆర్ట్ ఎగ్జిబిషన్ లోని చిత్రాలను, కళాకారులను ప్రశంసించారు.
ప్రాంత ప్రధాన కార్యదర్శి డా. వాడ్రెవు శివాజీ, గ్రేటర్ భాగ్యనగర్ అధ్యక్షులు భోగిరెడ్డి శ్రీనివాస్, ఈ చిత్రకళ ప్రదర్శన కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన గ్రేటర్ భాగ్యనగర్ దృశ్యకళా కన్వీనర్ శ్రీమతి సంతోషి లక్ష్మీ తదితరులు ప్రసంగించారు. ప్రాంత సంఘటన మంత్రి శ్రీ నిరంజన్, ప్రాంత మంచ్ కళా సంయోజక్ బేజుగం శ్రీనివాస్, ప్రాంత కార్యదర్శి శ్రీమతి భవాని, ప్రాంత నాటక విధా కన్వీనర్ శ్రీమతి స్వాతి, ప్రాంత కోశాధ్యక్షులు శ్రీమతి సరోజ బాల , ప్రాంత దృశ్య కళా సంయోజకురాలు శ్రీమతి జయశ్రీ, వివిధ జిల్లాల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వ్యాఖ్యతగా కుమారి భవ్య నిర్వహించారు.

More Stories
మ్యూచువల్ ఫండ్స్ లో తెలుగు ప్రజలు 2.95 లక్షల కోట్ల పెట్టుబడి
వాయుగుండంగా అల్పపీడనం.. తెలంగాణాలో మూడు రోజుల్లో భారీ వర్షాలు
ప్రజా సమస్యలపై చర్చలకు అడ్డుపడ్డ కాంగ్రెస్, బిఆర్ఎస్