
తూర్పు భారతదేశంలోని జాతీయవాద పౌరుల వేదిక అయిన పేట్రియాటిక్ పీపుల్స్ ఫ్రంట్ అస్సాం (పిపిఎఫ్ఎ) ఒక జాతీయ వార్తా ఛానల్ ‘కామాఖ్య ఆలయంలో క్రమం తప్పకుండా నరబలి జరుగుతుంది’ అనే బాధ్యతారహితమైన, అత్యంత అభ్యంతరకరమైన అభిప్రాయాలను ప్రసారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
మేఘాలయలో ఇండోర్‌కు చెందిన వ్యక్తిని కొత్తగా వివాహం చేసుకున్న భార్యనే హత్యా చేయించినట్లు అనుమానిస్తుండగా సోహ్రా (చిరాపుంజీ) చేరుకునే ముందు, ఆ జంట నగరంలోని నీలాచల్ కొండలపై ఉన్న పవిత్ర శక్తి పీఠాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. “బాధితుడి కుటుంబానికి (మధ్యప్రదేశ్ నుండి వచ్చిన వ్యక్తి) స్థలం ఇస్తూ, రాజా రఘువంశీని సోనమ్ రఘువంశీ చేత ‘బలి’ చేయించి ఉండవచ్చు” అని సిఎన్యెన్ న్యూస్18 ఓ తప్పుడు కధనాన్ని ప్రసారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పూర్తిగా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ, ‘నరబలి సాధారణంగా కామాఖ్యలో జరుగుతుంద’ అంటూ ఆ వార్తా యాంకర్ జోడించడం పట్ల అసహ్యాన్ని పిపిఎఫ్ఎ వ్యక్తం చేసింది. ఈ రకమైన మీడియా వ్యక్తులకు దేశం, దాని సాంస్కృతిక వారసత్వం గురించి తక్షణమే ఒక దృష్టి అవసరం అని హితవు చెప్పింది.
నిందితుడు సోనమ్ రఘువంశీతో పాటు మరో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, షిలాంగ్ కోర్టు జూన్ 19 వరకు మేఘాలయ పోలీసు కస్టడీకి పంపింది. వ్యక్తిగత విషాదాన్ని నివేదించేటప్పుడు మీడియా సంస్థలు ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను పాటించాలని పిపిఎఫ్ఎ కోరుతూ, నిర్దిష్ట వార్తా ఛానల్ చూపిన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం గురించి తీవ్రంగా గమనించి అవసరమైన చట్టపరమైన చర్యలతో ముందుకు సాగాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను, అలాగే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్‌ను డిమాండ్ చేసింది.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి