
“ఈ విషయంపై ఆయన్ని అడగండి. పరమేశ్వరపై చర్య తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఎవరు లేఖలు రాస్తున్నారో..?” అని ప్రహ్లాద్ జోషీ ఎద్దేవా చేశారు. రన్యారావుకు హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం అంగీకరించారు. అయితే అది ఆయన వివాహ బహుమతిగా రన్యారావుకు అందజేసిన మొత్తమని వివరించారు.
“ఒక వివాహం జరిగింది ప్రజలకు బహుమతిగా మేము 10 వేలు, 5 లేదా 10 లక్షలు ఇస్తాం. ఆమె ఏం చేసినా అది తప్పే. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను కేవలం పరమేశ్వర విషయమే మాట్లాడుతున్నా. ఆమెకు ఆయన అందజేసినది బహుమతి మాత్రమే” అని శివకుమార్ మీడియాకు తెలిపారు.
పరమేశ్వర పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయనే కాదు కాంగ్రెస్ నేతలెవ్వరూ తప్పుడు పనులు చేయరని ఆయన సమర్థించారు. రన్యారావు స్మగ్లింగ్ కేసులో సంబంధాలు ఉండటమే కాక, ఆమెతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణతలో హోం మంత్రికి చెందిన విద్యా సంస్థలపై ఈడీ బుధవారం దాడులు నిర్వహించి, రన్యారావుతో నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు