
తమ కొత్త పార్టీ పేరును కూడా ఈ సందర్భంగా ‘ఇంద్రప్రస్థ వికాస్’ పేరుతో పార్టీ అని ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోయెల్ ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయన ఆప్ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ ఉన్నారు.
తమకు 15 మంది కౌన్సిలర్ల మద్దతు ఉన్నట్టు కూడా తిరుగుబాటు వర్గం ప్రకటించుకుంది. 2022 ఎంసీడీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆప్ అధినాయకత్వం ఎంసీడీలో పలు అవకతలకు పాల్పడిందని, కౌన్సిలర్లకు, పార్టీ నాయకత్వానికి మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడిందని తిరుగుబాటు వర్గం ఆరోపించింది.
గత మున్సిపల్ ఎన్నికలకు ముందు వీరంతా కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇక 25 ఏళ్లుగా మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన గోయెల్ 2021లో కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరారు. మరోవైపు మూడు నెలల క్రితమే ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు అనితా బసోయ, నిఖిల్ చప్రానా, ధరమ్వీర్ బీజేపీలో చేరారు. ఇప్పుడు మరో 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు