
ఈ విషయంపై బాధిత వ్యక్తులు సీబీఐని ఆశ్రయించగా, ఈనెల 9న మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా ఉన్న సాజిదా మజ్హర్ హుస్సేన్ షాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన ముంబై సీబీఐ అధికారులు ఈ కేసులో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న జీవన్‌లాల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
జీవన్‌లాల్ ప్రస్తుతం హైదరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ (ఎగ్జంప్షన్) కమినర్‌గా, అప్పీల్ యూనిట్స్ 7,8కు ఇన్‌కంట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జీవన్‌లాల్‌తో పాటు ముంబైలోని షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ (పన్నులు) ఉద్యోగి వైరల్ కాంతిలాల్ మెహతా, శ్రీకాకుళానికి చెందిన సైరాం పలిశెట్టి, వైజాగ్‌కు చెందిన నట్ట వీరనాగ శ్రీరామ్ గోపాల్, ముంబైకి చెందిన సాజిదా మజహర్ హుస్సేన్ షాను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 18 చోట్ల తనిఖీలు చేపట్టారు. ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, న్యూఢిల్లీలలో సోదాలు చేశారు. సుమారు రూ. 69 లక్షలు నగదు సహా వివిధ నేరపూరిత పత్రాలు/వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో అరెస్టు చేసిన వారిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్టు సీబీఐ తెలిపింది.
అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరెస్టు చేసిన వారిని సంబంధిత న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టారు. సీబీఐ సోదాలు, అరెస్టులపై షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ స్పందించింది. ఈ కేసులో వారి డిప్యూటీ జనరల్ మేనేజర్ అరెస్టు కావడంతో అంతర్గత విచారణ ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని సీబీఐ అధికారులు తెలిపారు. కోర్టు ఐదుగురికి రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. మాజీ ఎమ్మెల్యే కూమారుడైన జీవన్‌లాల్ 2004లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాడు. .
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది