గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు.
ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్‌గా పని చేస్తున్నారని, ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారని న్యాయవాది తెలిపారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని స్పష్టం చేశారు. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారని తెలిపారు. కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.
వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయండని కోరారు. పాస్టర్ ఆనంద్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదిదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరని, నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొన్నారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?