ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను

ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన 26 మంది ప్రజల పేరిట జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేయబోనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో లేవనెత్తుతాం తప్ప, ఈ సమయంలో కాదని చెప్పారు. అంతేకాకుండా తన అతిథులను కాపాడుకోలేకపోయానని జమ్ముకశ్మీర్​ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భావోద్వానికి గురయ్యారు.

పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ “ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం. కానీ బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పని చేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరవయ్యాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

“తండ్రిని కోల్పోయిన పిల్లలకు, కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కోల్పోయిన భార్యకు, నేను ఏం సమాధానం చెప్పాలి? వారు మా తప్పు ఏమిటని అడిగారు. ‘మేము సెలవుల కోసం వచ్చాం’ అన్నారు. అయితే దీన్ని చేసిన వారు మన కోసమే చేశారని అంటున్నారు. కానీ నేను అడగాలనుకుంటున్నాను, మనం దీన్ని ఆమోదించామా? మేమ దీన్ని చేయమని చెప్పామా? మేము ఈ దాడికి మద్దతు ఇవ్వడం లేదు” అని ఒమర్ అబ్దుల్లా భావోద్వేగానికి గురయ్యారు.

ఉత్త‌రం నుంచి ద‌క్షిణం వ‌ర‌కు, తూర్పు నుంచి ప‌శ్చిమం వ‌రుకు, అరుణాచ‌ల్ నుంచి గుజ‌రాత్ వ‌ర‌కు, క‌శ్మీర్ నుంచి కేర‌ళ వ‌ర‌కు ఈ దాడి వ‌ల్ల దేశంలో అంద‌రూ చ‌లింపోయార‌ని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి దాడులు ఎన్నోచూశామ‌ని, అమ‌ర్‌నాథ్ క్యాంప్‌, దోహాలోని ప‌లు గ్రామాలు, క‌శ్మీరీ పండిట్లు, సిక్కులపై గ‌తంలో జ‌రిగాయ‌ని గుర్తు చేశారు. కానీ బైస‌రాన్ దాడికి ముందు చాలా గ్యాప్ వ‌చ్చింద‌ని, 21 ఏళ్ల త‌ర్వాత ఇంత పెద్ద స్థాయిలో సాధార‌ణ పౌరుల‌పై దాడి జ‌రిగిందని సీఎం ఒమ‌ర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

పహల్గాం దాడి తర్వాత తాపే ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రహోదా కోసం డిమాండ్‌ చేయాలని ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదని చెప్పారు. గతంలో రాష్ట్ర హోదా అడిగామని, భవిష్యత్తులో కూడా అడుగుతామని పేర్కొంటూ కానీ, ఇప్పుడు 26 మంది ఆమాయకులు చనిపోయారని, ఇలాంటి సమయంలో రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

ప్రజలు తమకు మద్దతిస్తే తీవ్రవాదం, ఉగ్రవాదం అంతమవుతాయని చెప్పమని గుర్తు చేస్తూ ఇది అందుకు ఆరంభమని చెప్పారు. ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏదీ మాట్లాడకూడదు, చేయకూడదని స్పష్టం చేశారు. తాము మిలిటెన్సీని తుపాకులతో అదుపు చేయగలమని, కానీ, తమకు అందుకు ప్రజల మద్దతు అవసరమనిని అబ్దుల్లా అసెంబ్లీలో స్పష్టం చేశారు.

ఎవ‌రు కూడా ఆ దాడికి మద్దతు ఇవ్వ‌ర‌ని, ఇది మ‌మ్మ‌ల్ని చుట్టివేసింద‌ని పేర్కొంటూ ఈ స‌మ‌యంలో ఓ ఆశా రేఖ కోసం ఎదురుచూస్తున్నామ‌ని, గ‌త 26 ఏళ్ల‌లో ఓ దాడిని ఖండిస్తూ ఇలా భారీ సంఖ్య‌లో జ‌నం నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం చూడ‌లేద‌ని సీఎం ఒమ‌ర్ గుర్తు చేశారు.